దేవినేనికి టీడీపీ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

devineni uma and tdp
Updated:  2018-09-28 12:15:11

దేవినేనికి టీడీపీ చెక్

మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. ప్ర‌స్తుతం నీటిపారుద‌ల శాఖామంత్రిగా ఉన్నారు. నాటినుంచి నేటివ‌ర‌కు ఓట‌మి ఎరుగ‌ని దేవినేని సుమారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. రెండుస్తారు నందిగామా, రెండుసార్లు మైల‌వ‌రం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా ఆయ‌న ప‌నితీరు ఎలాఉన్నా సెగ్మెంట్ లోని అనుచ‌రుల హ‌ల్ చ‌ల్ మాత్రం ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త పెంచుతోంది. 
 
మంత్రి అయ్యాక ఆయ‌న చాలామందిని ప‌క్క‌న పెట్టార‌ని, గతంలో ఆయ‌న గెలుపుకు కార‌ణం అయిన కీల‌క వ్య‌క్తుల‌నుకూడా ప‌క్క‌న‌పెట్టార‌ట‌. దీంతో వారంతా వ‌చ్చేఎన్నిక‌ల్లో ఉమాకు వ్య‌తిరేకంగా పని చెయ్య‌లాని కంక‌ణం క‌ట్టుకున్నార‌ట‌. త‌మపేరు, ప‌లుకుబ‌డి, అండ‌దండ‌ల‌తో ఎమ్మెల్యే అయిన ఉమా ఇప్పుడు త‌మ‌నే ఎదిరిస్తారా అంటూ వారు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ట‌. 
 
అంతేకాదు మంత్రి హోదాలో ఉన్న ఉమా నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద‌గా చేసింది ఏమీ లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌న్న‌వరం ఎమ్మెల్యే వంశీ , పెడ‌న ఎమ్మెల్యే కాగిత వెంక‌ట‌రావు విజ‌య‌వాడ ఎంపీ కేసీనేని నానిల‌తో ఉమాకు విభేదాలు ఉన్నాయి. ఇక సొంత పార్టీ నేత‌ల‌ను క‌లుపుకుని వెళ్ల‌డంలేరనే విమ‌ర్శ‌లును దూరం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు ఉమా. 
 
ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు జోగి ర‌మేష్.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు  త‌గిలిన రుచిని ఎలాగైనా దేవినేనికి రుచి చూపించాల‌ని చూస్తున్నారు. అందులో భ‌గంగానే నియోజ‌క‌వ‌ర్గంలోని కార్య‌క‌ర్త‌లను క‌లుపుకుంటు టీడీపీ నాయ‌కులు చేస్తున్న అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు క్షుణ్ణంగా వివ‌రిస్తూ ర‌మేష్. దీంతో ప్ర‌జ‌లు వాస్త‌వాల‌ను గ్ర‌హించి టీడీపీకి చెందిన వారు వైసీపీకి స‌పోర్ట్ చేస్తున్నారు. టీడీపీలో ఉన్నాకూడా త‌మ‌కు ప్ర‌భుత్వ ఫ‌లాలు అంద‌కున్నాయ‌ని వారువోపుత‌న్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.