టీడీపీకి కొత్త స‌వాల్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-09 17:16:14

టీడీపీకి కొత్త స‌వాల్ ?

ఉత్త‌రాంధ్రాలో వైసీపీలో చేరిక‌ల పై తెలుగుదేశం కొత్త ఎత్తులు వేస్తోంది.. ఓవైపు గుంటూరు, కృష్ణా, ప్ర‌కాశం, నెల్లూరు, ప‌శ్చిమ‌గోదావ‌రి, జిల్లాల్లో వైసీపీలోకి వ‌ల‌స‌లు నివారించాలి అని తెలుగుదేశం ప్లాన్ వేసింది.. చివ‌ర‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర గాలిలో ఈ వ‌ల‌స‌ల నివార‌ణ అనే ప్లాన్ తెలుగుదేశానికి బెడిసి కొట్టింది అనే చెప్పాలి.ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలో కూడా కాపుల‌కు తెలుగుదేశం ఎటువంటి హామీలు నెర‌వేర్చ‌లేదు.. దీంతో వారు తెలుగుదేశానికి దూరం అవుతారు అని తెలుస్తోంది.
 
ఇటు జ‌గ‌న్ కు పాద‌యాత్ర‌లో తూర్పుగోదావ‌రిలో ప్ర‌జ‌లు ఎటువంటి ఆద‌రణ చూపుతారా అని తెలుగుదేశం కూడా ఆలోచ‌న‌లో ప‌డింది.. ముఖ్యంగా కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ కూడా తెలుగుదేశం పై టార్గెట్ గా ఉన్నారు. ఇటు మంత్రులుగా జిల్లాలో ఉన్న చిన‌రాజ‌ప్ప, కాపులకు తెలుగుదేశం ఇచ్చిన హామీని నెర‌వేర్చింది అని చెబుతుంటే,  ఇటు వైసీపీ త‌ర‌పున జిల్లాలో అధికార పార్టీ పై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతున్నారు.
 
ఇక ఈ ఐదు జిల్లాలో ప‌రిస్దితి చేయిదాటిపోయింది.. ఇక తెలుగుదేశం ఇక్క‌డ గెలుపు గుర్రాల వేట‌లో ఉంది.మ‌రి వైసీపీలోకి వ‌ల‌స‌లు లేకుండా నిలువ‌రించ‌లేక‌పోయింది. అయితే వైసీపీ విధానాలు ఎలా ఉన్నా టీడీపీవి ప్ర‌యాశ‌లుగా ఉండిపోయాయి.ఇక ఉత్త‌రాంధ్రాలో వైసీపీలోకి వ‌ల‌స‌లు ఉండ‌కుండా నిరోధించాలి అని తెలుగుదేశం ప్లాన్ ర‌చించింది.దీనికోసం ఇప్ప‌టికే విశాఖ మంత్రికి బాధ్య‌తలు అప్ప‌గించింది అంటున్నారు పార్టీ నాయ‌కులు.
 
ముఖ్యంగా వైసీపీ ఎటువంటి స్ట్రాట‌జీతో ఇక్క‌డ నాయ‌కుల‌ను పార్టీలోకి చేర్చుకుంటుందో చూసి ఆ స్ట్రాట‌జీని తిప్పి కొట్టాల‌ని చూస్తున్నారు అధికార పార్టీ నాయ‌కులు.. పార్టీ ప‌ద‌వుల పై హామీ ఇవ్వాలి అని సూచించార‌ట‌....ఇటు మాజీ మంత్రి కేంద్ర‌మంత్రి కాంగ్రెస్ లో చ‌క్రం తిప్పిన మ‌హిళానాయ‌కురాలు వైసీపీలో చేరే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలిసి, ఆమెను తెలుగుదేశంలో చేర్చుకోవ‌డానికి ప్లాన్ రచిస్తోంది తెలుగుదేశం.. మొత్తానికి ఇటు ఆమె రాక‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే ఎదురుతిరుగుతున్నారు అని, ఆమె ప్రాభ‌వం పెరుగితే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌కం అవుతుంది అని అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలోచిస్తున్నార‌ట.. మ‌రి ఈ మూడు జిల్లాలో వైసీపీలో చేరిక‌లు లేకుండా టీడీపీ ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో చూడాలి.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.