బాబు కాంగ్రెస్ సీక్రెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-12 16:37:40

బాబు కాంగ్రెస్ సీక్రెట్

దేశంలో విప‌క్షాల తీరుకు నిర‌స‌న‌గా మోదీ ఇచ్చిన పిలుపు మేర‌కు దేశంలో బీజేపీ నాయ‌కులు ఓ రోజు దీక్ష‌కు పూనుకున్నారు...ఈ స‌మ‌యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న నిరాహార దీక్షను అడ్డుకనేందుకు తెలుగుదేశం పార్టీ యత్నిస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. 
 
టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఏకమై పార్లమెంటును అడ్డుకున్నాయని నరసింహారావు విమ‌ర్శించారు. . విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో దీక్షకు పోలీసుల అనుమతి కోరగా తిరస్కరించారని ఆయన తెలియ‌చేశారు. పార్లమెంటు నిర్వహణలో అడ్డుపడటమే కాక, బీజేపీ శాంతియుతంగా నిరాహార దీక్షకు కూడా టీడీపీ అడ్డుపడుతోందని ఆయ‌న విమ‌ర్శించారు.
 
బుధవారం లెనిన్‌ సెంటర్‌లో సీపీఐ దీక్షకు అనుమతించారని, బీజేపీకి అదే స్థలంలో దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ఆయ‌న తెలుగుదేశం స‌ర్కారును ప్రశ్నించారు.  ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పంచన చేరారన్నారు... కాంగ్రెస్ తో కుమ్మ‌క్కై రాజ‌కీయాలు చేస్తున్న చంద్ర‌బాబు ముసుగు త్వ‌ర‌లో తొలుగుతుంది అని ఎద్దెవా చేశారు బీజేపీ నాయ‌కులు.
 
అలాగే ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని ఆయన అన్నారు. అలాగే అవిశ్వాస తీర్మానంపై చర్చకు మేం వెనుకడుగు వేయలేదని, అవిశ్వాసం చర్చకు రాకుండా అడ్డుకున్నదెవరో అందరికీ తెలుసన్నారు. టీడీపీ కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, తెలుగుదేశం చేసే కుట్ర రాజ‌కీయాలు బ‌య‌ట‌పెడ‌తామ‌ని ఆయ‌న తెలియ‌చేశారు. మొత్తానికి ఇటు తెలుగుదేశం అటు బీజేపీ వార్ ప్ర‌త్యేక హూదా పై మ‌రింత వేడెక్కిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.