టీడీపీ అవినీతి పార్ట్ 1 బీజేపీ ఫోక‌స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu image
Updated:  2018-03-28 11:56:46

టీడీపీ అవినీతి పార్ట్ 1 బీజేపీ ఫోక‌స్ ?

ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఊహించ‌నంత స్థాయిలో మ‌లుపులు తిరుగుతున్నాయి. కేంద్రంతో  మైత్రి బంధాన్ని వ‌దులుకున్న అధికార తెలుగుదేశానికి బీజేపీ అధ్య‌క్షుడు  అమిత్ షా ఘాటుగా లేఖ రాసిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు అమిత్‌ షా లేఖ తెర‌దించింది.అయిన‌ప్ప‌టికి తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఏ మాత్రం స్పీడు త‌గ్గ‌కుండా విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు.
 
దీనికి స్పందించిన  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు గ‌త నాలుగు ఏళ్ల‌లో టీడీపీ వైఫ‌ల్యానికి అమిత్‌ షా లేఖ మొదటి విడత మాత్రమేనని, ఇంకా చాలా నిజాలను ప్రజల ముందు పెడతామని ఆయ‌న అన్నారు . కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందన్న వాదన ఒకవేళ నిజమైతే,  అందుకు సీఎం చంద్రబాబుతోపాటు టీడీపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని స్పష్టం చేశారు. ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టే సత్తా లేకపోవడం చంద్ర‌బాబు అసమర్థత‌కు నిద‌ర్శ‌నం అని అన్నారు.
 
నాలుగేళ్లు కేం ద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ది చేసుకోలేకపోయారని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండా ఏమి చేస్తున్నార‌ని  జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు.  ప్రతిపక్షం లేని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గంటల తరబడి అసత్యాలు చెప్పి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇక పార్టులు పార్టులుగా తెలుగుదేశం అవినీతి చిట్టాలు బ‌య‌ట‌పెడ‌తామ‌ని, కేంద్రం నిధులు ఇవ్వ‌లేదు అని చెప్పుతున్న ఈ తెలుగుదేశం నాయ‌కులు,  అస‌లు ఎన్ని నిధులు రాష్ట్రానికి సాధించారో చెప్పాల‌ని అప్పుడు కేంద్రం ఎన్నినిధులు ఎంత మేర ఇచ్చిందో లెక్క‌లు బ‌య‌ట‌పెడ‌తామ‌ని అన్నారు.. ఇక బీజేపీ తెలుగుదేశం పై పుస్తకాలు ప్ర‌చురించి క‌ర‌ప‌త్రాల రూపంలో రాష్ట్రంలో పంపిణీకి సిద్దం అవుతున్న సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.