టీడీపీకి బిగ్ షాక్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-01 10:27:16

టీడీపీకి బిగ్ షాక్‌

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌రిపాల‌న చేస్తున్న‌ విధానాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు  ఆమోదించ‌డం లేదు. దీంతో టీడీపీ ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌తతో  ఉన్నారు.  ప్ర‌జ‌లు ఇచ్చిన‌టువంటి బాధ్య‌త‌ను విస్మ‌రించి అవినీతికి, అక్ర‌మాల‌కు నిల‌యంగా మార‌డం వ‌ల్ల‌నే ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తున్నారని ప‌లువురు వ‌క్త‌లు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.తెదేపా ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త వ‌ల్ల సొంత పార్టీ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లోకి వెళ్ల‌డానికి సిద్దం అవుతున్నారు.
 
అయితే తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో అధికార పార్టీకి చెందిన కౌన్సిల‌ర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సుమంత్, తులసీ తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమిషనర్‌కు అందించారు. త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ఇరువురు కౌన్సిల‌ర్లు, త‌మ వార్డుల అభివృద్దికి నిధులు విడుద‌లు చేయాల‌ని, ప‌లు మార్లు మున్సిపల్ శాఖను కోరినా ఫ‌లితం లేక‌పోయింద‌ని అన్నారు. అందువ‌ల్లనే రాజీనామా చేస్తున్న‌ట్లు వారు వివ‌రించారు.
 
అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లకు సైతం నిధులు మంజూరు చేయ‌క‌పోవ‌డంపై స్థానిక ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాజీనామా చేయ‌డానికి సిద్దం అయిన  కౌన్సిలర్లను బుజ్జ‌గించ‌డానికి మంత్రులు రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం ల‌భిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.