టీడీపీకి అది తెలియ‌దు?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-01 17:56:13

టీడీపీకి అది తెలియ‌దు?

మ‌హానాడు వేదిక‌గా జేసి ఆరోప‌ణ‌లు పార్టీలో ప్ర‌కంప‌న‌లు రేపాయి... జేసి ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వాల పై ఇటు తెలుగుదేశం కూడా స‌మాలోచ‌న‌లు చేస్తోంది..ఇక తెలుగుదేశం పార్టీలో కేంద్ర బిందువు అవుతున్నారు ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి. అయితే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పై జేసి ఆరోప‌ణ‌లు చేయ‌డం పై ఇటు బీజేపీ కూడా  ఎటువంటి ప్ర‌శ్న‌లు సందించ‌డం లేదు.
 
మ‌హానాడు కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ జ‌గ‌న్ కి 1500 కోట్ల రూపాయ‌లు ఇచ్చారు అంటూ కామెంట్లు, విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేశారు..అయితే ఇటు వైసీపీ నాయ‌కులు జేసి మాట‌లను ఖండించారు.. ఇటు బీజేపీ దీనికి కౌంట‌ర్లు ఇచ్చే సాహాసం కూడా చేయ‌డం లేదు.
 
ఇటు తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎటువంటి కామెంట్లు చేస్తున్నా ఎందుకు దీనిపై బీజేపీ మౌనం వ‌హిస్తోంది. కాన్నాలాంటి లీడ‌ర్ కు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చినా ఎందుకు ఇటువంటి వాటిని నిరోధించ‌లేక‌పోతున్నారు అని ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.
 
అయితే రాజమండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ దీనిపై స్పందించారు.. జేసి దివాక‌ర్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు చాలా తీవ్రం అయినవి, ప్ర‌ధానిపై ఆరోప‌ణ‌లు చేశారు, దీనిపై విచార‌ణ జ‌ర‌పాలి అని ఆయ‌న అన్నారు. ఇక్క‌డ ఇద్ద‌రి స‌చ్చీల‌త నిరూపించుకోవాలి అనేలా ఉండ‌వ‌ల్లి స‌ల‌హా ఇచ్చారు.
 
దివాకర్ రెడ్డి సీనియర్ చట్ట సభ సభ్యుడని, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో ఒక దానికి ఛైర్మెన్ గా వున్నారని, అలాంటి వ్యక్తి ఆరోపణలకు విలువ ఇవ్వాలని, కనుక తక్షణం విచారణ జరిపి తీరాలన్నారు.. ఇక తెలుగుదేశం మంత్రుల్లో య‌న‌మ‌ల ఆర్దిక మంత్రిగా ఉన్నా కూడా జ‌గ‌న్ కేసుల విష‌యాలు తెలిసినా ఏవో లెక్క‌లు చెబుతున్నారు కాని వాస్త‌వాలు చెప్ప‌డం లేదు అని విమ‌ర్శిస్తున్నారు.
 
 
తెలుగుదేశం నాయ‌కులు చెప్పేది విమ‌ర్శించేది జ‌గ‌న్ అక్ర‌మాస్తులు 43 వేల కోట్ల రూపాయ‌లు అని...  ఆ కేసుల్లో మొత్తం విలువ 12, నుంచి 13 వందల కోట్లరూపాయ‌లు మాత్ర‌మే చార్జ్ షీట్లు అని, ఇప్పటికే 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రిలీజ్ అయ్యాయని గుర్తు చేశారు ఉండ‌వ‌ల్లి..అయినా తెలుగుదేశం నాయ‌కులు ఈ కేసుల విష‌యంలో నిజాలు వాస్త‌వాలు ఏనాడు మాట్లాడ‌ర‌ని అవ‌న్నీ అవాస్త‌వాలే అని వైసీపీ విమ‌ర్శిస్తోంది... అస‌లు జ‌గ‌న్ కేసులు ఏమిటో కూడా తెలుగుదేశానికి తెలియ‌దు అని వైసీపీ గుర్తుచేస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.