టీడీపీని అడ్డంగా ఇరికించిన బీజేపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababunaidu-narendra-modi
Updated:  2018-02-24 02:47:58

టీడీపీని అడ్డంగా ఇరికించిన బీజేపీ

ఆంధ్రప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న  టీడీపీకి కొత్త స‌మ‌స్య  తెచ్చిపెట్టింది మిత్ర ప‌క్ష‌మైన బీజేపీ. ఇప్ప‌టికే కేంద్రానికి విరుద్దంగా విమ‌ర్శ‌లు చేస్తూ, రాష్ట్ర ప్ర‌జ‌ల్లోప్ర‌భుత్వం పై ఉన్న  వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటూ,  వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతోంది  తెలుగుదేశం పార్టీ.. అయితే బీజేపీ తాజాగా  రాయ‌ల‌సీమ డిక్లేరేష‌న్ అంటూ, కొత్త విష‌యాన్ని తెర మీద‌కు తెచ్చింది భార‌తీయ జ‌న‌తా పార్టీ.
 
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాయ‌ల‌సీమ‌కు జ‌రుగుతున్న అన్యాయం పై ఆ ప్రాంత నాయ‌కుడు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అనేక ఉద్య‌మాలు చేస్తూ యాత్ర‌లు సైతం చేశారు. అయన్ను కూడా సీఎం చంద్ర‌బాబు పార్టీలోకి అహ్వానించ‌డంతో రాయ‌ల‌సీమ ప‌ట్ల గ‌ళం విప్పే నాయ‌కులు క‌రువ‌య్యారు. రాయ‌ల‌సీమ ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న‌విద్యార్థులు, మేధావులు ఉద్య‌మాలు చేస్తుంటే వారిని అరెస్టు చేయించి భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తోంది తెలుగుదేశం స‌ర్కార్‌.
 
ఈ నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ వ్య‌వ‌హారం ముందుకు పెట్టి... ఏపీ బీజేపీ నేతలు సీఎం చంద్రబాబును ఇరుకున పెడుతున్నారు. తాజాగా కర్నూలులో జరిగిన సమావేశంలో బీజేపీ రాయ‌ల‌సీమ డిక్లేరేష‌న్ విడుద‌లు చేసింది. శ్రీ భాగ్ ఒప్పందాన్ని అమ‌లు చేయాల‌ని, ఏపీ రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని.. సీమ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలని తెలిపింది
 
రాయలసీమలో ఉన్న 4 జిల్లాలను 8 జిల్లాలుగా విభజించాలని.. సీమలో నీటి పారుదల ప్రాజెక్టులకు రూ. 10 వేల కోట్లు కేటాయించాలని.. వచ్చే బడ్జెట్ లో రాయలసీమకు రూ. 20 వేల కోట్లరూపాయ‌ల  ప్రత్యేక నిధిని కేటాయించాలని డిక్లరేషన్ లో పెట్టారు. దీంతో పాటు రాయలసీమ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపించారు.... 6 నెలలకు ఒకసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలన్న అంశాన్ని తెరపైకి తెచ్చారు.
 
రాష్ర అభివృద్దిని ఒకేచోట‌ కేంద్రీకృతం చేసి, మ‌రోసారి రాయ‌ల‌సీమ‌కు అన్యాయం చేస్తున్నార‌ని టీడీపీని విమ‌ర్శించారు... మా డిమాండ్ల‌ను నేర‌వేర్చాల‌ని క‌డ‌ప జిల్లాలో ఈ నెల 28న ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని బీజేపీ నేత‌లు తెలిపారు. ఈ స‌మ‌స్య‌కు తెలుగుదేశం ప్ర‌భుత్వం ఎలాంటి స‌మాధానం చెబుతుందో వేచిచూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.