రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ డైల‌మా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp flag image 3
Updated:  2018-03-10 10:56:39

రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ డైల‌మా?

రాజ్య‌స‌భ అభ్య‌ర్దుల కోసం తెలుగుదేశం పార్టీ ఇంకా స్ప‌ష్ట‌త‌లోకి రాలేదు అంటున్నారు నాయ‌కులు. ఇక రాజ్య‌స‌భ నామినేష‌న్ల‌కు సోమ‌వారం నామినేష‌న్ల దాఖ‌లు గ‌డువు ముగియ‌నుంది.. వైసీపీ ఓ ప‌క్క తమ అభ్య‌ర్దిని ప్ర‌క‌టించేసింది ఇప్ప‌టికే.. ఇక తెలుగుదేశం అయితే ఇంకా ఓ కొలిక్కి రాలేదు అనే మాట‌లే వినిపిస్తున్నాయి.
 
రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండడంతో వారి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు మార్చి 23వ తేదీన ఎన్నిక నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మూడింటిలో రెండు టీడీపీకి, ఒకటి వైఎస్సార్‌ సీపీకి రాజ్య‌స‌భ సీట్లు ద‌క్క‌నున్నాయి... తెలుగుదేశానికి అభ్య‌ర్దిని ప్ర‌క‌టించ‌డంతో ఆశావాహుల్లో రోజు రోజుకూ టెన్ష‌న్ పెరిగిపోతోంది....ఇక తెలుగుదేశం అధినేత ఎప్పుడూ ఎటువంటి ధోర‌ణి అనుస‌రిస్తారో అలాగే అనుసరించనున్నారు.. త‌మ పార్టీ త‌ర‌పున అప్ప‌టిక‌ప్పుడు చివ‌రి రోజు అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించ‌నుంది తెలుగుదేశం పార్టీ....ఈ నేపథ్యంలో ఆదివారం పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం టీడీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
 
టీడీపీకి ద‌క్కే రెండు స్ధానాలు ఎస్సీ బీసీల‌లో చెరోఒక‌టి స్ధానం కేటాయించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.....ఎస్సీ వర్గానికి చెందిన సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, వర్ల రామయ్య పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బీసీల నుంచి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు రేసులో ఉన్నా చంద్రబాబు ఆయనకు అవకాశం ఇస్తారో లేదో అనుమానమే. తనను రాజ్యసభకు పంపాలని యనమల చాలాకాలం నుంచి కోరుతున్న విషయం తెలిసిందే.  ఇక నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామిక‌ వేత్త బీద మస్తాన్‌రావుకు అవకాశం ఇవ్వాలని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు చంద్రబాబును కలిసి కోరారు. 
 
ఇక అలాగే  ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనను మరోసారి కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌ గట్టిగా కోరుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.. ఇక జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ పేరు కూడా వినిపిస్తోంది.. మొత్తానికి చంద్ర‌బాబు ఈ అవ‌కాశం ఎవ‌రికి ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.