ప్ర‌త్యేక హోదాకు తూట్లు పొడ‌వ‌డానికి సిద్ధ‌మైన టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 15:04:47

ప్ర‌త్యేక హోదాకు తూట్లు పొడ‌వ‌డానికి సిద్ధ‌మైన టీడీపీ

తెలుగుదేశం నాయ‌కులు ఉద‌యం నుంచి అర్ద‌రాత్రి వ‌ర‌కూ జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ చేస్తూనే ఉంటున్నారు...మ‌రీ ముఖ్యంగా మాతో నాలుగు సంవ‌త్స‌రాలు క‌లిసి ఉన్న బీజేపీ ఒక్క‌సారిగా జ‌గ‌న్ అండచూసుకుని, జ‌గ‌న్ స‌పోర్ట్ అనే మాట తీసుకుని వారితో ఒప్పందం చేసుకుని, మాకు విడాకులు ఇచ్చింది అని మద‌న‌ప‌డుతున్నారు..అయితే జ‌గ‌న్ ప‌దే ప‌దే చెప్పే మాట ఒకటే, ఏపీకి ఎవ‌రు ప్ర‌త్యేక హోదా ఇస్తారో వారితో క‌లిసి ముందుకు వెళ‌తాం, అలాగే వారికి మ‌ద్ద‌తు ఇస్తాం అని చెబుతున్నారు.
 
తెలుగుదేశం అధినేత మాత్రం ప్ర‌త్యేక హోదా సంజీవ‌నా అని ప‌లికారు...ఇక వైసీపీ ప్ర‌త్యేక హోదాపై పోరాటం చేయ‌డంలో అదే ప‌ట్టుద‌ల‌తో ముందునుంచి ఉంది... ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక హోదా అంశం బ‌లంగా ఉండ‌టంతో కేంద్రం పై ఫైట్ అని బ‌య‌ట‌కువ‌చ్చిన తెలుగుదేశం ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రానికి  తాము క‌టీఫ్ చెప్పాము, అని యూ ట‌ర్న్ తీసుకున్నారు.
 
దీంతో కేంద్రం కూడా ముందు ఒప్పుకున్న ప్యాకేజీకి ఇప్పుడు ఏం అడ్డువ‌చ్చింది అని ప్ర‌శ్నిస్తోంది...అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం తెలుగుదేశాన్ని మ‌రింత ఇరుకున‌ పెడుతోంది. సీఎం చంద్ర‌బాబు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు పోరాటం ధ‌ర్మం అంటూ దీక్ష చేస్తున్నా, ప్ర‌జ‌ల నుంచి ఎటువంటి స్పంద‌న క‌నిపించ‌డం లేదు... దీంతో వ‌చ్చే జ‌న‌వ‌రి వ‌ర‌కూ వివిధ రూపాల్లో ప్ర‌త్యేక హోదా పోరాటాలు చేస్తాము అని అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు.
 
అంటే జ‌న‌వ‌రి వ‌ర‌కూ వీరు ప్ర‌త్యేక హోదా రాదు అని ఫిక్స్  అయ్యారు అంటే, ఇక ప్ర‌త్యేక హోదా తీసుకురాలేరా అని ప్ర‌శ్న కూడా వ‌స్తోంది ప్ర‌జ‌లనుంచి... ఇంకా ఏడు నెల‌లు ఉంది జ‌న‌వ‌రి రావ‌డానికి, అప్పుడే జ‌న‌వ‌రి వ‌ర‌కూ వివిధ ర‌కాలుగా పోరాటాలు చేస్తాం అంటున్నారు అంటే దీని అర్ధం ఏమిటి.
 
మ‌రి జ‌గ‌న్ మాత్రం మొద‌టి నుంచి ఒకే స్టాండ్ పై నిలుచున్నారు.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అది కేంద్రం ఇవ్వాల్సిందే 15 ఏళ్లు కావాలి అని కోరిన చంద్ర‌బాబు పీఎంతో మాట్లాడి ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించాల‌ని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.