టీడీపీ హితబోధ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-07 16:35:17

టీడీపీ హితబోధ

తెలుగుదేశం పార్టీలో చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు ఎవ‌రైనా చేశారు అంటే..? ఫ‌స్ట్ విజ‌యవాడ రీజ‌యన్ నుంచి ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న రంగంలోకి దిగుతారు...ఇటు గ‌తంలో వైసీపీ కాల్ మ‌నీ సెక్స్ రాకెట్ పై బుద్దా వెంక‌న్న‌ను టార్గెట్ చేసిన‌ప్ప‌టి నుంచి బుద్దా వెంక‌న్న కూడా స‌మ‌యం దొరికిన ప్ర‌తీసారి వైసీపీ పై విమ‌ర్శ‌లు చేస్తారు.. అయితే తాజాగా వైసీపీ మ‌హిళా నాయ‌కురాలు న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా పై ఆయ‌న కొన్ని అనుచిత వ్యాఖ్య‌లు చేసి, సొంత పార్టీ నాయ‌కుల చేత సీనియ‌ర్ల  చేత చివాట్లు తిన్నారు ఆయ‌న‌.
 
రోజా మద్యం తాగి మీడియా సమావేశం పెట్టారని, ఆమె విజయవాడకు వస్తే కోడి గుడ్లతో కొడతామంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు బుద్దా వెంక‌న్న‌..దీనిపై వైసీపీ నాయ‌కులు బుద్దా వెంక‌న్న‌పై తీవ్ర‌స్దాయిలో మండిప‌డుతున్నారు. తెలుగుదేశం నాయ‌కులు మ‌హిళ‌ల‌కు గౌర‌వం ఎలా ఇస్తున్నారో ఇదే ఓ నిద‌ర్శ‌నం అని ఆరోపించారు.. మ‌రీ ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే శాస‌న స‌భ్యుల‌రాలిపై ఇలా అగౌర‌వంగా మాట్లాడ‌వ‌చ్చా అని ప్ర‌శ్నిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి స్పందించారు. మహిళల పట్ల ఇలాంటి దిగజారుడువ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారామె... మహిళలపై వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచన చేసి మాట్లాడాలన్నారు. పార్టీలకతీతంగా మహిళలను గౌరవించాలన్నారు రాజ‌కుమారి ఎప్పుడైనా రాజ‌కీయంగా వ్యక్తిగత ఆరోపణలు సరికాదన్నారు.
 
వెంకన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు రాజ‌కుమారి  బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్‌ కూడా స్పందించారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలు వ్యక్తిగతమని పార్టీతో సంబంధం లేదన్నారు. అయితే పార్టీలో ఉండి మ‌రో పార్టీలో ఎమ్మెల్యేని తిడితే అది పార్టీకి సంబంధం లేని అంశం అన‌డం ఏమిటి అని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది.
 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు వెంక‌న్న వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. బుద్ధిలేని బుద్ధా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా..? అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు దుష్ట​ పరిపాలనలో మహిళలు, చిన్నారులు నలిగిపోతున్నారని ఆయ‌న విమ‌ర్శించారు.

షేర్ :

Comments

1 Comment

  1. B. Venkanna oka loafer vedhava. Veedi talli, veedi akka, veedi bharya andaru mallikarjunapeta peru unna vyabhicharulu. Edi vja motha. Telusu. Veedu call money sex racket lo pradhama muddayi. Veedi jeevitam motham vja prajalaku baaga telusu. Dirty fellow.

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.