ఆళ్ల‌గ‌డ్డ‌లో ఓట‌మి ప‌క్కా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-13 02:56:22

ఆళ్ల‌గ‌డ్డ‌లో ఓట‌మి ప‌క్కా....

అధికార తెలుగుదేశం పార్టీలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ఆరోప‌ణలు వ‌స్తూనే ఉన్నాయి. దీంతో పాటు ప‌లు జిల్లాల్లో టీడీపీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు తారా స్ధాయికి చేరుకుంది. తాజాగా మంత్రి అఖిల ప్రియ‌కు ఆళ్ల‌గ‌డ్డ మాజీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జ్ ఇరిగెల రాంపుల్లా రెడ్డి  హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. 
 
పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే పార్టీ అధినాయ‌క‌త్వానికి ఫిర్యాదు చేస్తామ‌ని, మంత్రి అఖిల‌ప్రియ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని రాంపుల్లా రెడ్డి ఆరోపించారు. క‌డ‌ప రోడ్డులోని ఆర్టీసీ బ‌స్టాండు ఖాళీ స్ధ‌లంలో ఆర్టీసీ అధికారుల దుకాణాలు నిర్మించేందుకు 2015,2017 లో పిలిచిన టెండ‌ర్ల‌ను మంత్రి అఖిల ప్రియ ర‌ద్దు చేయించార‌ని ఇరిగెల మండిప‌డ్దారు. 
 
దీంతో పాటు నియోక‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ది పనుల‌కు టెండ‌ర్లు పిలువ‌గా, అవి త‌న వ‌ర్గానికి సంబంధించిన వారికి రాక‌పోవ‌డంతో టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసేందుకు మంత్రి అఖిల ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఇలా అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ నియోక‌వ‌ర్గంలో టీడీపీ ఓడిపోయే ప‌రిస్ధితులు వ‌స్తాయ‌ని ఇరిగెల పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.