వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-25 18:05:28

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.. ఈ పాదయాత్రకి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఈ ప్రజా సంకల్ప యాత్రలో జగన్ తో పాటు నడుస్తూ తమ సమస్యలను ప్రతిపక్ష నేతకు తెలియజేస్తున్నారు ప్రజలు...జగన్ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ, తన పరిధిలో ఉన్న సమస్యలను తీరుస్తూ, వాళ్లకు మనోధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నారు...
 
జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు... ఈ యాత్రకు వస్తున్న ప్రజలను చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి, నాయకులు వైసీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు...ఇప్పటికే అన్ని పార్టీల నుండి అనేక మంది నాయకులు పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు...మరికొందరు వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు..
 
ఇప్పటికే అనేక మంది పార్టీలోకి రావడంతో వైసీపీ జోరుగా ఉంది...ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు...టీడీపీ నేత అత్తిలి మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ నెల 27న ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ సమక్షంలో పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు..
 
అత్తిలి మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుంది, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రజలతో నాటకాలు ఆడుతున్నారు. అందుకే టీడీపీకి రాజీనామా చేసి,కార్యకర్తలతో చర్చించి, కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు ఈ నెల 27న వైసీపీలో చేరుతున్నానని చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.