వైసీపీ ఎమ్మెల్యేల‌పై అక్ర‌మ కేసులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-05 17:13:36

వైసీపీ ఎమ్మెల్యేల‌పై అక్ర‌మ కేసులు

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌పై టీడీపీ అధిష్టానం నాలుగు సంవ‌త్స‌రాల నుంచి ముప్పుతిప్ప‌లు  పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. అందులో ముఖ్యంగా మంగ‌ళ‌గిరి నుండి ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి అలాగే నెల్లూరు నుండి కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డిని, న‌గిరి నుండి రోజా, గుడివాడ నుండి కొడాలి నాని, నెల్లూరు రూర‌ల్ నుండి అనిల్ కుమార్ యాద‌వ్, న‌ర‌స‌రావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డిల‌ను టీడీపీ అధిష్టానం అక్ర‌మంగా కేసుల‌ను పెట్టి వారికి ప్ర‌జ‌ల మీద వ్య‌తిరేక‌త పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.
 
అయితే వీరంద‌రూ నాలుగు సంవ‌త్స‌రాల నుంచి టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు వైసీపీ ఎంపీలు. ఇక వారిని ఎదుర్కొనే ఛాన్స్ త‌క్కువ‌గా ఉండ‌టంతో చంద్ర‌బాబు అధికార బ‌లంతో వైసీపీ నాయ‌కుల‌పై అలాగే వారికి అండ‌గా ఉన్న కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మంగా కేసులు పెట్టిస్తున్నారని మండిప‌డుతున్నారు.
 
అయితే ముందుగా శ్రీ‌ధ‌ర్ రెడ్డిని క్రికెట్ బుకింగ్ కేసులో ఇరికించారు. వాస్త‌వంగా చెప్పాలంటే శ్రీ‌ధ‌ర్ రెడ్డికి క్రికెట్ మెట్టింగ్ కు ఎలాంటి సంబంధం లేదు కానీ టీడీపీ అధిష్టానానికి అడ్డు వ‌స్తుండ‌టంతో ఆయ‌న‌పై బెట్టింగ్ కేసులు పెట్టించారు. అలాగే అవినీతి ఆరోప‌ణ‌ల‌పై స‌స్పెండ్ అయిన డిఎస్పీ దుర్గాప్ర‌సాద్ కు ఆళ్ళ భార్య బినామిగా ఉందంటూ ఆళ్ల‌పై ఏసిబి కేసులు పెట్టించి విచార‌ణ‌ పేరుతో గంట‌ల పాటు అదుపులో ఉంచుకున్నారు. 
 
ఇక దీంతో పాటు న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా ఈమె గురించి పెద్ద‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకుంటే టీడీపీ నాయ‌కుల ప‌రిపాల‌న‌పై ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటారు. ఇక ఆమె విమ‌ర్శ‌లకు చెక్ పెట్టేందుకు చంద్ర‌బాబు ఎన్నో విధాలుగా ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు. ఇక చివ‌రికి చేసేది ఏమిలేక‌ అసెంబ్లీ నుండి నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఏడాది పాటు స్పీక‌ర్ తో స‌స్పెండ్ చేయించారు. 
 
ఆ త‌ర్వాత మ‌హిళా స‌ద‌స్సుకు హాజ‌ర‌వ్వ‌టానికి వ‌చ్చిన రోజా విష‌యంలో పోలీసులు ఏ విధంగా వ్య‌వ‌హ‌రించారో అంద‌రికీ తెలిసిందే. ఇక రోజా తో పాటు కాపు రిజ‌ర్వేష‌న్ల‌ ఉద్య‌మ స‌మయంలో తునిలో ర‌త్నాచ‌ల్ రైలు ద‌హ‌నం కేసులో వైసీపీ ప్ర‌ధాన కార్యద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి పై కేసు న‌మోదు చేశారు. ఇలా చంద్ర‌బాబు త‌న‌పై వైసీపీ నాయ‌కులు ఎవ‌రైతే తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారో అవ‌కావం దొరికితే చాలు అక్ర‌మంగా కేసులు పెట్టిస్తున్నారు. 
 
చంద్ర‌బాబు నాయుడు అండ్ కోల అవినీతిపై వీరు సాక్ష్యాల‌తో స‌హా మీడియాకు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నందున ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి పూర్తి మ‌ద్ద‌తు వ‌స్తోంద‌ని టీడీపీ గ్ర‌హించి 2019 ఎన్నిక‌ల్లో వారిని గెల‌వ‌నివ్వ‌కుండా అక్ర‌మంగా కేసులు పెట్టిస్తోందిని వైసీపీ ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి మండిప‌డుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు వైసీపీ నాయ‌కుల‌పై అక్ర‌మంగా ఎన్ని కేసులు పెట్టిన 2019 లో వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.