నాలుగున్న‌ర ఏళ్ల టీడీపీ పాల‌న‌లో రాయ‌ల‌సీమ‌కు జ‌రిగిన అన్యాయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-06-21 16:24:18

నాలుగున్న‌ర ఏళ్ల టీడీపీ పాల‌న‌లో రాయ‌ల‌సీమ‌కు జ‌రిగిన అన్యాయం

రాజధాని కర్నూల్ లో లేకుండా అమరావతి లో ఏర్పాటు చెయ్యడం
 
120 GO తో రాయలసీమ ఆడబిడ్డల గొంతు కొయ్యడం
 
బాడిగలు, అద్దెలు తగ్గించక పోతే పరిశ్రమలు, అభివృద్ధి రాయలసీమకు పోతాయి అని అమరావతి లో వాళ్ళనుబెదిరించడం (ఏమో రాయలసీమ పాకిస్తాన్ లో ఉన్నట్లు).
 
క్యాన్సర్ ఆసుపత్రి ని తిరుపతి నుంచి అమరావతి ఎత్తుకు పోయే ప్రయత్నం.
 
ఎయిమ్స్ AIMS మన సీమలో లేకుండా కోస్తాకు తరలించడం.
 
ముచ్చుమర్రి పంపులు పట్టిసీమకు తరలించడం.
 
ESI సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అమరావతిలో ఏర్పాటు చేయడం.
 
ఆరోగ్య శ్రీ పతకం మనకు అనుకూలంగా ఉన్న హైదరబాద్ ఆసుపత్రిలలో ల్యాకుండా ,చల్లకుండా విజయవాడలకు మార్చడం(ఈ చర్య వల్ల మనకు అలవాటు లేని ఊళ్ళో సీమ సామాన్య జనం పడుతున్న ఇబ్బందులు ఎవ్వరికీ తెలియదు.Note కనీసం మన సీమలో ఆసుపత్రుల్లో స్థాయి పెంచే ఆలోచన చెయ్యక పోగా విజయవాడ పోయి సావండి అనే ధోరణి మంచిది కాదు).
 
అమరావతి ఉద్యోగాల్లో సీమ వాళ్లకు వాటా ఇవ్వాలనే ఆలోచన చేయకపోవడం.
 
గుంతకల్లు జోన్ విస్మరించి విశాఖపట్నం పాట పాడడం.
 
ఎక్కడో తుని లో కోస్తా వాళ్ళు రైళ్లు కాలుస్తే సీమ వాళ్ళ పనే అని అకారణంగా బురద జల్లిన CM.
 
కడప ఉక్కు గురించి నిర్దిష్టంగా ఏనాడు పోరాడక, పోరాడుతున్న వారిని అవమానించడం.
 
పట్టిసీమ పూర్తి చేసిన విదంగా మన రాయలసీమ ప్రాజెక్టులు HnSS/GNSS లు పూర్తి చేయకపోవడం.
 
అనంతపురం దశబ్దాల కలైన సమాంతర కాలువ గురించి ఒక్క నిమిశం ఆలోచన చెయ్యక పోవడం.
 
శ్రీబాగ్ ఒప్పందం గుర్తించి హై కోర్ట్ అన్నా ఇవ్వాలన్న కనీస న్యాయమైన కోర్కెను కూడా గుర్తించక పోవడం, ఇది కూడా అమరావతి లొనే ఏర్పాటు చేస్తామని చెప్పడం.
 
రాయలసీమ రైతాంగానికి గుండెకాయ లాంటి సిద్దేశ్వరం ప్రాజెక్టు కోసం వేల మంది రైతులు పోరాటం చేస్తున్నా దాని పై ఆలోచన చెయ్యక పోవడం.
 
400 TMC నికరజలాల సీమ కోర్కె పై దృష్టి సారించక పోవడం.
 
ఇలా చెప్పుకుంటూ పోతే కసాపురం ఆంజనేయ సామీ తోక కన్నా పెద్దదిగా పోతుంది. 
 
ఇంత మోసం చేస్తూ పోతున్న ప్రభుత్వం నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీమ రాగం పాడడం దయ్యాలు వేదాలు వల్లించి నట్టే ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.