చంద్రబాబు చేసిన పనికి తలెత్తుకోలేక పోతున్న టీడీపీ వీరాభిమానులు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and tdp
Updated:  2018-11-02 01:34:50

చంద్రబాబు చేసిన పనికి తలెత్తుకోలేక పోతున్న టీడీపీ వీరాభిమానులు..

సోషల్ మీడియాలో టీడీపీ వీరాభిమానులు...ఏపీలో టిడిపి నాయకులు, టీడీపీ  జెండా కోసమే బ్రతికున్నాం అని చెప్పుకునే నాయకులందరూ తెల్లబోయేలా చేస్తూ చంద్రబాబు కాంగ్రెస్ ను అక్కున చేర్చుకోవడం ఎవరికీ మింగుడు పడడం లేదు.. ఎన్నో ఏళ్లుగా టీడీపీ ని కన్నతల్లిలా భావించి ఆరాధిస్తున్న అభిమానులకు చంద్రబాబు రాహుల్ పంచన చేరిన వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇంతకీ ఆవేదన చెందిన అభిమాని చంద్రబాబు పై ఎలా దుమ్మెత్తిపోశాడో చూద్దాం.. 
 
సంవత్సరాలుగా సోషల్ మీడియాలో టీడీపీకి అండగా నిలిచిన చుండు సుధాకర్ అనే టిడిపి వీరాభిమాని చంద్రబాబు రాహుల్ తో భేటీ అవడాన్ని సమర్ధించకపోగా ఏకంగా టిడిపికే గుడ్ బై చెప్పేశాడు. ఇక కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే గుడ్డలూడదీసి తంతారు అన్న టిడిపి సీనియర్ నాయకుల సమాధానాన్ని, చంద్రబాబు కనుక కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే ఉరేసుకుని ఛస్తా అని ఆవేశపడిన నాయకుల స్పందన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే మాత్రం ఆ నాయకులందరూ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మీడియా ముందుకు రావడం విషయం పక్కనపెడితే, స్థానిక టిడిపి కార్యకర్తలను ఫేస్ చేయడానికి కూడా మొహం చెల్లడం లేదని సన్నిహితులతో వాపోతున్నారు.
 
అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రుల చేతికి చిప్ప ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి సోనియాను గెలిపించండి అని ప్రచారం చేయడానికి చంద్రబాబుకు మనసు ఎలా వస్తోంది అని ఒక టిడిపి సీనియర్ నాయకుడే ప్రశ్నిస్తున్నాడు. జగన్‌పై జగనే దాడి చేయించుకున్నాడు అని తాను అనడంతో పాటు, పార్టీ నాయకుల చేత కూడా, భజన మీడియా చేత ప్రచారం చేయించిన చంద్రబాబు నిన్న సడన్‌గా ప్లేట్ ఫిరాయిస్తూ జగన్‌పైన జగనే దాడి చేయించుకున్నాడు అని నేను అనలేదని, అలా ఏ నాయకుడైనా ఎందుకు చేస్తాడని మీడియానే దబాయిస్తూ కొత్తగా మాట్లాడేశాడు. ఇక ఇలాంటి ఎన్నో యూటర్న్ విషయాలు ఇప్పుడు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా చంద్రబాబు అంటే వ్యతిరేకత ఏర్పడేలా చేస్తున్నాయి. దానికి ప్రస్తుతం ఎపి లో జరుగుతున్న రాజకీయ పరిణామాలే నిదర్శనం.

షేర్ :

Comments

0 Comment