ప్రజాసంకల్ప యాత్రలో జగన్ ఎక్కడ అడుగుపెట్టినా అక్కడి ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్నారు. వేలాదిగా తరలి వస్తూ జననేతకు నీరాజనాలిస్తున్నారు. పెరుగుతున్న జనాదరణ చూసి టీడీపీ నేతలకు తలనొప్పి ఎక్కువైంది. ఈసారి జగన్ సీఎం అవుతాడేమో అని టెన్షన్ పడుతున్నారు. అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో కూడా జగన్ పెరుగుతున్న క్రేజ్ చూసి వారికి వెన్నులో వణుకు మొదలైంది. అందుకే రకరకాల వికృత చేష్టలు చేస్తున్నారు.
టీడీపీ ఫాలోయర్స్ ఎక్కువగా ఉన్న గుంటూరులో జగన్ పాదయాత్రకు ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. నరసారావుపేట, నారాకోడూరు, చేబ్రోలులో జగన్ పాదయాత్రకు, బహిరంగ సభలకు వెళ్లకుండా జనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దింతో ఏమి చేయలేక వై.ఎస్.జగన్ పాదయాత్ర ముగిసిన తరువాత రోడ్లను పసుపు నీళ్లతో కడిగి టీడీపీ నేతలు చేసిన ఓవర్ యాక్షన్ తెలిసిందే.
తాజాగా తెనాలి, అంగలకుదురు ప్రాంతాల్లో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు పచ్చ నేతలు. కానీ వారు ఎంత ఒత్తిడి చేసినా, పాదయాత్రకు వెళ్లకుండా అడ్డుకున్నా, జనం వారిని ఖాతరు చేయలేదు. వేల సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీకి ఓడిపోతామన్న భయం పట్టుకుంది అందుకే ఇలాంటి చేష్టలకు దిగుతున్నారు.
టీడీపీ ఓడిపోతే వీళ్లు చేసిన అవినీతి ఎక్కడ వెంటాడుతుందో అని భయపడుతున్నారు. అందుకోసమే దిగజారుడు రాజకీయాలకు సైతం సిద్ధమయ్యారు. అయితే ఇంత దిగజారుడుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలను జనం అసహ్యించుకుంటున్నారు. ఇకనైనా ఇలాంటి దుశ్చర్యలు ఆపకపోతే ప్రజల ఆగ్రహానికి గురి అవ్వాల్సొస్తుందని హెచ్చరిస్తున్నారు వైసీపీ నాయకులు.
Comments