అందుకే ఎన్నిక‌లకు టీడీపీ దూరం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 15:15:06

అందుకే ఎన్నిక‌లకు టీడీపీ దూరం

వైసీపీ ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల పోరాటానికి రెడీ  అంటోంది ...మ‌రో ప‌క్క ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించ‌డంతో, ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఆ ఉప ఎన్నిక‌ల‌కు తాము సిద్దంగా ఉన్నాము అని తెలియ‌చేశారు..ఇక వైసీపీ నాయ‌కులు ఏ ఎన్నిక‌ల‌కు అయినా తాము సిద్దం అని తెలియ‌చేస్తున్నారు.. ముఖ్యంగా ఉప ఎన్నిక‌లు వ‌స్తే తెలుగుదేశం ఏం చేయాలా అనే ఆలోచ‌న‌తో ఇప్ప‌టికే స‌త‌మ‌త‌మ‌వుతోంది.. మ‌రో ప‌క్క టీడీపీ నాయ‌కులు మాత్రం ధీమాగా ఉన్నారు.
 
ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, మ‌రో ప‌క్క డిసెంబ‌రులో జ‌మిలి ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు రావ‌డంతో అల‌ర్ట్ అయింది. ఇటు తెలుగుదేశం పార్టీ మాత్రం ఎన్నిక‌లు రావు అని ధీమాగా ఉంది.. ఇక మ‌రో ప‌క్క పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో కూడా డైల‌మానుంచి తెలుగుదేశం ఇంకా అదే ఆలోచ‌న‌లో ఉంది.. ఇటు మూడు కార్పొరేష‌న్ రెండు మున్సిప‌ల్ ఎన్నిక‌ల కు కూడా దూరంగా ఉండాల‌ని బాబు ఆలోచిస్తున్నార‌ట‌.
 
ఇక తెలుగుదేశం మాత్రం ఈ స‌మ‌యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే ఎటువంటి ఇబ్బంది ఎదురు అవుతుందా అనే డైలామాలో ఉంది.. ఇక డిసెంబ‌రులో ఎన్నిక‌ల‌కు అన్నీ అసెంబ్లీలు మ‌ద్ద‌తు ఇచ్చినా  ఇటు తెలుగుదేశం ఇచ్చే ఆస్కారం లేదు.. ఇటు మంత్రి లోకేష్ తో పాటు కోస్తా మంత్రులు రాయ‌ల‌సీమ నాయ‌కులు ఇప్ప‌టికే దీనిపై స్ప‌ష్టంగా తెలియ‌చేశారు.. 
 
ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు ప్రకారం ఐదు సంవ‌త్స‌రాలు మొత్తం పాల‌న చేస్తాం అని చెబుతున్నారు.. గ‌తంలో  నంద్యాల ఎన్నిక‌ల‌కు రెడీ అయిన‌ట్టు ఇప్పుడు తెలుగుదేశం అంత ధీమాగా ముందుకు వెళ్ల‌లేక‌పోతోంది..ఇటు బీజేపీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, పోల‌వ‌రం అంశం, నిరుద్యోగ భృతి, కాపు హామీలు అమ‌రావ‌తి నిర్మాణం, ఒక‌టా రెండా ప‌ద్మ‌వ్యూహాంలో చిక్కుకున్న‌ట్టే ఉంది అధికార టీడీపీ ప‌రిస్దితి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.