నాని సెగ్మెంట్ వ‌ద్దు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-04 17:10:12

నాని సెగ్మెంట్ వ‌ద్దు

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర కృష్ణాజిల్లాలో అద‌ర‌గొట్టింది అనే చెప్పాలి..ముఖ్యంగా ఎక్కువ మంది నాయ‌కులు వైసీపీలో చేరిన స‌మ‌యం కూడా కృష్ణాజిల్లా  పాద‌యాత్ర‌లో అనే చెప్పాలి..కృష్ణాజిల్లాలో  జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మ‌రోకీల‌క నాయ‌కుడు ఇద్ద‌రూ జ‌గ‌న్ పార్టీలో చేరారు..అయితే ఇటు పార్టీ త‌ర‌పున ఎటువంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాలో అలాగే జగ‌న్ నిర్ణ‌యాలు తీసుకున్నారు.
 
ఇద్ద‌ర‌కూ చెరోసీటును కేటాయించారు జ‌గ‌న్..ఇక తెలుగుదేశం పార్టీకి ఈ ఇద్ద‌రూ కోల్పోవ‌డం మైనస్ అయింది..మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త వెంకట కృష్ణప్రసాద్ చేర‌డం ఆయ‌న‌కు మైల‌వ‌రం సీటు ఇవ్వ‌డంతో ఇటు వ‌ర్గ‌పోరు లేకుండా పెడ‌న సీటును ర‌మేష్ కు అప్ప‌గించారు... దీంతో ఇటు రెండు చోట్లా వ‌ర్గ‌పోరు లేకుండా జ‌రిగింది. య‌ల‌మంచిలి ర‌విని కూడా జిల్లా నాయ‌కులు స్వాగ‌తించారు.
 
అయితే తెలుగుదేశం ముందు నుంచి ఆలోచించిన ఆలోచన, ఆచ‌ర‌ణ‌లో ముందుకు వెళ్లాలి అనుకున్ననిర్ణ‌యం నుంచి వెనక్కి  వ‌చ్చింది అని తెలుస్తోంది.. గుడివాడ నుంచి ఈ సారి కొడాలి నానిని ఓడించాలి అని భావించింది సైకిల్ పార్టీ ... అందులో భాగంగా ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యే బాల‌య్య లేదా మంత్రి లోకేష్ పోటీ చేయాలని భావించారు. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో గుడివాడ‌లో వైసీపీ ప‌రిస్దితి చూసి తెలుగుదేశం వెన‌క‌డుగువేసింది అని తెలుస్తోంది.ఇటు బాల‌య్య - లోకేష్ కూడా పోటికి వెన‌క‌డుగు వేశారు అని జిల్లాలో చ‌ర్చ జ‌రుగుతోంది.
 
ఇక్క‌డ కొడాలి నానికి తిరుగులేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో నానికి గుడివాడ సెగ్మెంట్లో  గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజార్టీకి రెట్టింపు వ‌స్తుంది అని తెలుస్తోంది.. ఇటు పీకే స‌ర్వే కూడా ఇక్క‌డ నానికి మ‌రింత విజ‌యావ‌కాశాలు ఉన్నాయి అని తేల్చింది... ఇంట‌ర్న‌ల్ సైకిల్ పార్టీ డ్యాష్ బోర్డు కూడా అదే రిపోర్టు ఇచ్చింద‌ట‌.దీంతో పార్టీ త‌ర‌పున నాని సెగ్మెంట్లో కొత్త నిర్ణ‌యాలు తీసుకుని బోల్తా ప‌డ‌కూడ‌దు అని తెలుగుదేశం భావిస్తోంది. అందుకే తాజాగా టీడీపీ నాయ‌కులు సీనియర్లు ఈ సెగ్మెంట్  సీటు  ప్ర‌స్తుత ఇంచార్జ్ కే ఇవ్వాల‌ని ఆలోచిస్తున్నార‌ని జిల్లా టీడీపీలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.