బీజేపీ మీన్స్ బ్రోక‌ర్లు, జోక‌ర్లు,పిచ్చోళ్ల పార్టీ... టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp and bjp
Updated:  2018-08-24 06:09:16

బీజేపీ మీన్స్ బ్రోక‌ర్లు, జోక‌ర్లు,పిచ్చోళ్ల పార్టీ... టీడీపీ

అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల‌కు, భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులకు కొద్దికాలంగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్న వైర్యం వీరిద్ద‌రి మ‌ధ్య  న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ నాయ‌కులు రాష్ట్రంలో జ‌రుగుతున్న అనేక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద‌మ్ముంటే భ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చెయ్యాల‌ని స‌వాల్ విసురుతున్నారు బీజేపీ నాయ‌కులు. 
 
ఇక వీరు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు టీడీపీ నాయ‌కులు బాగానే రియాక్ట్ అవుతున్నారు. ఇదే క్ర‌మంలో బీజేపీ నాయ‌కులు బోగాపురం ఎయిర్ పోర్టు టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసి భారీ అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఎమ్మెల్సీలు జవీఎల్ న‌ర‌సింహులు, సోము వీర్రాజులు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహన్ కు ఫిర్యాదు చేశారు. వెటంనే భోగాపురం ఎయిర్ పోర్ట్ వ్య‌వ‌హారంపై చ‌ర్య‌లు తీసుకుని సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని వారు కోరిన సంగ‌తి తెలిసింది. 
 
అయితే వారు చేసిన ఫిర్య‌దుల‌పై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ స్పందించారు. బీజేసీ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌లో ఎలాంటి వాస్త‌వాలు లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు టెండ‌ర్ల‌లో ఎలాంటి అవినీతి జ‌రుగ‌లేద‌ని ఈ టెండ‌ర్ల‌పై తాము ఎంలాంటి విచార‌ణ‌కైనా సిద్ద‌మ‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్  స్ప‌ష్టం చేశారు. బీజేపీ నాయ‌కులకు ద‌మ్ముంటే రాఫెల్, ఎస్సార్  కుంభ‌కోణాల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
 
అంతే కాదు బీజేపీ పార్టీకి కొత్త అర్థాన్ని చెప్పారు రాజేంద్ర‌ప్ర‌సాద్. బీజేపీ అంటే బ్రోక‌ర్లు, జోక‌ర్లు,పిచ్చోళ్ల పార్టీ అని ఆయ‌న అర్థం చెప్పారు.రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌ష్టప‌డుతుంటే బీజేపీ నాయ‌కులు దానిని స‌హించ‌లేక ఇష్ట వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్ మండిప‌డ్డారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.