ప‌వ‌న్ ఫ్యాన్స్ కు చుక్కలు చూపిస్తున్న టీడీపీ అభిమానులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp fires on pawan kalyan
Updated:  2018-03-20 04:34:57

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు చుక్కలు చూపిస్తున్న టీడీపీ అభిమానులు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  అభిమానులకు, నందమూరి అభిమానులకు మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది..అలాగే ఈ రెండు వర్గాల మధ్య పొంత‌న క‌రువైపోయింది... నందమూరి హీరోల సినిమాలు బాగుంటే ప‌వ‌న్ అభిమానులు చూడటానికి ఇష్టపడతారేమో కానీ... అదే మెగా హీరోల సినిమాలు బాగున్నా సరే చాల మంది నందమూరి అభిమానులు చూడటానికి ఇష్టపడరు...2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు అన్ని గొడవలను మర్చిపోయి తన అభిమాన హీరో కోసం టీడీపీ కి ఓటు వేశారు...
 
నాలుగేళ్లపాటు పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయకపోవడంతో టీడీపీ అభిమానులు పవన్ పై, పవన్ అభిమానులు టీడీపీ పైన ఎటువంటి విమర్శలు చేసుకోలేదు...జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీపైన ఘాటైన వ్యాఖ్యలు చేసారు...టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని...టీడీపీ ప్రభుత్వం అన్ని రకాల వారిని మోసం చేసిందని...ఇసుక నుండి మద్యం, మట్టి వరకు దొరికిన ప్రతి దాంట్లో దోచుకుంటున్నార‌ని ప‌వ‌న్ మండిపడ్డారు...పోలవరం టెండర్ల విషయం నుంచి అన్నింట్లో అవినీతి జరిగింది అని విమర్శించారు ప‌వ‌న్...అంతేకాదు టీడీపీ చేస్తున్న అవినీతిలో లోకేష్ కి సంబంధం ఉందని చెప్పారు జనసేన అధినేత...
 
ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయ‌కులు ఎక్క‌డ మీడియా దొరికితే  అక్క‌డ పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు...ఇక బాలకృష్ణ అయితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి అతన్ని హీరో చేయడం నాకు ఇష్టం లేదు అన్నారు. ఒకరు పవన్ కల్యాణ్ అవివేకి అంటే, మరొకరు పవన్ కల్యాణ్ కు అసలు విలువలే లేవు అంటున్నారు. మరికొందరైతే లోకేష్ ను విమర్శించే అర్హత పవన్ కల్యాణ్ కు లేదని అంటున్నారు. పవన్ కల్యాణ్ కు మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఏ అత్తారింటికి వెళ్లాలో తెలియడంలేదు అందుకే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ నాయ‌కులు...
 
మా నాయకుడు చంద్ర‌బాబుని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఎంతో కష్టపడ్డారు, అలాగే నాలుగేళ్లు పాటు టీడీపీకి మద్దతుగా ఉన్న సరే, టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడంతో టీడీపీకి కృతజ్ఞత లేదని బాధపడుతున్నారు...సోషల్ మీడియా వేదికగా కూడా టీడీపీ అభిమానులు పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తుతున్నారు... పవన్ అభిమానులకు టీడీపీ అసలు రూపం బయటపడటంతోంది

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.