రాజ్యసభ అభ్యర్థులను ఖ‌రారు చేసిన టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp flag image 4
Updated:  2018-03-11 03:13:35

రాజ్యసభ అభ్యర్థులను ఖ‌రారు చేసిన టీడీపీ

ఎట్ట‌కేల‌కు రాజ్యసభ అభ్యర్థులను ఖ‌రారు చేసిన తెలుగుదేశం పార్టీ. రాజ‌కీయాల్లోకి వ‌చ్చినప్ప‌టి నుంచి టీడీపీ త‌రుపున అనేక పోరాటాలు చేస్తూ పార్టీ బ‌లోపేతానాకి కృషిచేసిన సిఎం ర‌మేష్, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్‌ పేర్ల‌ను పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు అధికారికంగా ప్ర‌క‌టించారు.
 
రాజ్యసభ రెండు స్థానాల‌ను ఒసి సామాజిక వ‌ర్గానికే కేటాయించారు సీఎం చంద్ర‌బాబు. బ‌డుగు, బ‌లహీన వ‌ర్గాల‌కు టీడీపీ అండ‌గా ఉంటుంద‌న్న చంద్ర‌బాబు చేత‌ల్లో చూపించ‌డంలేద‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది. అయితే రాజ్యసభ స్థానానికి చివ‌రి వ‌ర‌కు రేస్‌లో ఉన్న ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ వ‌ర్ల రామ‌య్య‌కు  మొండి చేయి చూపించింది టీడీపీ పార్టీ. 
 
రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాల‌కు ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ వెలువ‌డిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇప్ప‌టికే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున‌ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డిని రాజ్య‌స‌భ అభ్యర్థిగా ప్ర‌క‌టించారు వైయ‌స్ జ‌గ‌న్‌. వైయ‌స్ఆర్ పార్టీ త‌రుపున నామినేష‌న్ సైతం దాఖ‌లు చేశారు రాజ్య‌స‌భ అభ్యర్థి వేమిరెడ్డి. రాజ్య‌స‌భ నామినేష‌న్ వేయ‌డానికి రేపే ఆఖ‌రి రోజు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.