వైసీపీ ట్రాక్‌లో టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kanna lakshmi narayana comments on tdp
Updated:  2018-04-05 14:53:19

వైసీపీ ట్రాక్‌లో టీడీపీ

పార్ల‌మెంట్‌లో కేంద్రానికి వ్య‌తిరేకంగా టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ- కాంగ్రెస్ యేత‌ర పార్టీల‌ను ఏకం చేయ‌డానికి పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దిల్లీ ప‌ర్య‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న వ‌ల్ల ఏదో జ‌రుగుతుంది అని న‌మ్మిన రాష్ట్ర ప్ర‌జ‌లకు, పార్టీ నాయ‌కులకు తీవ్ర నిరాశ క‌లిగించారు. చంద్ర‌బాబు దిల్లీ ప‌ర్య‌ట‌న కేవ‌లం జాతీయ మీడియాతో మాట్లాడ‌డానికే వెళ్లిన‌ట్లు ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 
 
బాబు దిల్లీ ప‌ర్య‌ట‌న పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడిన క‌న్నా ల‌క్ష్మి నారాయ‌ణ‌ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాక‌ట్టు పెట్టార‌ని చంద్ర‌బాబు పై ధ్వ‌జ‌మెత్తారు. పార్ల‌మెంట్‌లో ఉన్న చంద్ర‌బాబును క‌ల‌వ‌డానికి ఎవ‌రూ ఆస‌క్తి చూప‌లేద‌ని అన్నారు. ఢిల్లీ వెళ్లి హేమమాలినిని కలిసి వస్తావా.. ఏపీ సీఎంగా ఆంధ్రుల పరువు తీశారని ఆయ‌న‌ ఘాటుగా విమర్శించారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌డానికి కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు రాసిన లేఖే కార‌ణ‌మ‌ని తెలిపారు. ఏపీ ప్రయోజనాలు కోసం చంద్రబాబు ఏనాడూ పోరాటం చేయలేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అధికారంలోకి రావడానికి సాధ్యంకాని హామీల‌ను ప్ర‌క‌టించి, అధికారంలోకి వచ్చాక అవినీతి అసమర్థత పాలన చేస్తున్నారని ఆయ‌న మండిపడ్డారు. అవినీతి, అక్ర‌మాల‌ను కప్పిపుచ్చుకొనేందుకే బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నరేంద్ర మోదీపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
 
రాష్ట్రానికి పెట్టుబ‌డుల కోసం అంటూ ప్రత్యేక విమానాల్లో తిరగడం తప్ప రాష్ట్రానికి ఏమి సాధించార‌ని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులను హంగు ఆర్బాటాల‌కు  ఉప‌యోగిస్తున్నారని అన్నారు. ప్రజలు కట్టిన పన్నులు టీడీపీ కార్యకర్తలు పంచుకుంటున్నారని విమర్శించారు. ప్ర‌త్యేక‌ హోదాకు బదులు ప్ర‌త్యేక ప్యాకేజీని ఒప్పుకుంది చంద్రబాబేనని  స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని వ్యాఖ్యానించిందీ, ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో అభినందన తీర్మానం చేసింది కూడా చంద్రబాబేనని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.
 
ముఖ్య‌మంత్రి చంద్రబాబు హెరిటేజ్ సంస్థను ఎందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు త‌ర‌లించ‌లేదని ప్రశ్నించారు. బీజేపీని ముంచాలని చూస్తూ చంద్రబాబు మునిగిపోతున్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. చంద్ర‌బాబు చేసే మోసాలను ప్రజలు గమనించాలని ఆమ‌న‌ విన్నవించారు. రైల్వే జోన్ ఇస్తామని ఎన్నడూ బీజేపీ చెప్పలేదని, ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపింది బీజేపీనేని వెళ్ల‌డించారు. ప్రాజెక్టు నిర్మాణాలను కావాలనే ఆలస్యం చేస్తూ తన తప్పులను బీజేపీపై రుద్దాలని బాబు భావిస్తున్నారని చెప్పారు.
 
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి కట్టుబట్టలతో పంపారని చంద్ర‌బాబు చెప్ప‌డాన్ని క‌న్నాలక్ష్మీనారాయణ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. వైసీపీ  ప‌య‌నిస్తున్న ట్రాక్‌లో టీడీపీ ప‌డింద‌ని ఆయ‌న అన్నారు...అమెరికాలో కూడా లేని రేట్లతో తాత్కాలిక భవనాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని,  తాత్కాలిక భవనాలు కడుతున్న సీఎంను ప్రజలు తాత్కాలిక సీఎంగానే చూస్తున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.