ఈ జిల్లాలో టీడీపీ ఓటు బ్యాంకింగ్ త‌గ్గుముఖం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-17 03:07:55

ఈ జిల్లాలో టీడీపీ ఓటు బ్యాంకింగ్ త‌గ్గుముఖం

19 అసెంబ్లీ స్థానాలు అతిపెద్ద జిల్లా తూర్పుగోదావ‌రి జిల్లా, కాపు సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండే తూర్పు గోదావ‌రిలో, మాల, సెట్టిబ‌లిజా మ‌త్స్య‌కార, యాద‌వ‌, ప‌ద్మ‌శాలి, ర‌జ‌కా, నాయి బ్రాహ్మ‌ణ కులాలు కీలకమైన‌వి, రాష్ట్ర రాకీయాల్లో సీనియ‌ర్లు అయిన ఎంద‌రో నేత‌లు ఇక్క‌డే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, హోం మంత్రి చినరాజ‌ప్ప, శాస‌న‌మండ‌లి డిప్యూటి చైర్మ‌న్ రెడ్డి సుబ్ర‌మ‌ణ్యం, పార్ల‌మెంట్ లో ఫ్లోర్ లీడ‌ర్ గా తోట న‌ర‌సింహం, అలాగే సీనియ‌ర్ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు తోట త్రిమూర్త‌లు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వంటివారు ఈ జిల్లా నుంచే టీడీపీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని అందిస్తున్నారు. 
 
ఇక మాజీ మంత్రి శుభాష్ చంద్ర‌బోస్ దివంగ‌త మాజీమంత్రి జ‌గ్గం పైడి రామ్మోహ‌న్ రావు కుటంబంతో పాటు ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటున్నారు. కుటుంబ సామాజిక ప‌రంగా ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప్ర‌ధాన పార్టీల‌కు బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంది ఈ జిల్లాలో. బీజేపీ ఎమ్మెల్యే గా, ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ జిల్లా నుంచే రాష్ట్ర  రాజ‌కీయాల‌లో రాణిస్తున్నారు. 
 
ఈ జిల్లా ప్ర‌త్యేక‌త‌..
 
ఇక రాజ‌కీయంగా తూర్పు గోదావ‌రి ఎప్పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూనే ఉంది. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ వైసీపీ మ‌ధ్య తూర్పు గోదావ‌రిలో హోరా హోరీ పోరు జ‌రిగిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇక ఈ పోరులో తెలుగుదేశం పార్టీ 12 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు 5 స్థానాల్లో విజ‌యం సాధించారు. రాజ‌మండ్రి అర్భ‌న్ పిఠాపురం అసెంబ్లీ స్థానాల‌ను బీజేపీ ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు గెలుచుకున్నారు. అయితే ఎన్నిక‌ల త‌ర్వాత రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు తీవ్ర‌స్థాయిలో మారిపోవ‌టంతో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు.
 
ఇక ఇండిపెండెంట్ వ‌ర్మ కూడా చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. దీంతో టీడీపీ బ‌లం 16కు చేరుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ జిల్లా కంచుకోట‌గా ఉంటోంది. కాపులు, బీసీలు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చిన ప్ర‌తీ సారి టీడీపీ విజ‌యం సాదిస్తూ వ‌స్తోంది. 2004, 2009లో వైఎస్ దెబ్బ‌కు వెనుకబ‌డిన టీడీపీ 2014 నాటికి చంద్ర‌బాబు నాయుడు హామీల‌కు ఆర్షితులై టీడీపీకి పూర్వ వైభ‌వాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోను వైసీపీ గ‌ట్టి పోటీ ఇచ్చింది. టీడీపీకి ఎక్కువ‌సీట్లు వచ్చినా రెండు పార్టీల మ‌ధ్య ఓట్ల తేడా 75 వేల నుంచి 80 వేల ఓట్లు మాత్ర‌మే. దీంతో వైసీపీ స్వ‌ల్ప తేడాతో కొన్ని సీట్ల‌ను కోల్పొవాల్సి వ‌స్తోంది. 
 
ఇక తూర్పు గోదావ‌రి జిల్లాల సామాజిక వ‌ర్గాల ప్ర‌తిప‌దిక‌న తిరిగే రాజ‌కీయాలు క‌నిపిస్తాయి. కాపు, బీసీ, ఎస్సీ కులాలు మ‌ధ్య రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం పోరాటం ఉంటోంది. 2014 ఎన్నిక‌ల్లో 12 సీట్లు గెలిచిన టీడీపీ 16కు చేరిన త‌న బ‌లాన్ని వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ నిల‌బెట్టుకోవాల‌నే ఉద్దేశ్యంతో ఉంది. కానీ ప్ర‌జ‌లు మాత్రం టీడీపీ నాయ‌కుల‌కు సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. ఇక మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష‌ నాయ‌కులు తూర్పులో వ‌చ్చే ఎన్నిక‌లకు సీట్ల‌ను పెంచుకోవాల‌ని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. 
 
ఇక దాంతో పాటు జ‌న‌సేన కూడా ఇదే జిల్లాలో గంపెడు ఆశ‌ల‌ను పెట్టుకుంది. ఈ జిల్లాలో జ‌న‌సేన పార్టీ పోటీతో టీడీపీ ఓట్లు చీలిక ఖాయం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నిర్మాణాత్మ‌కమైన ప్ర‌ణాళికా విధానాన్నిఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌క పోవ‌డంతో వాటివైపు మొగ్గె వ‌ర్గాలు వేచిచూసే ధోర‌ణిని అణ‌చివేస్తున్నాయి. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ తూర్పు గోదావ‌రిలో నాలుగు సీట్లు గెలుచుకుంది. ఇక మెజార్టీ స్థానాల‌ను స్వ‌ల్ప ఓట్ల తేడాతో కోల్పోయింది. అయితే అప్ప‌ట్లో టీడీపీ ఓటు బ్యాంక్ చీలి ప్ర‌జారాజ్యం వైపు మ‌ళ్లింది. ఇక ఇప్పుడు ప‌వ‌న్ తూర్పులో బ‌ల‌మైన అభ్య‌ర్ధుల‌ను దించితే మ‌ళ్లీ టీడీపీ ఓట్లు చీల‌డం ఖాయం అని భావిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.