టీడీపీకి బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp and ycp flags
Updated:  2018-05-01 06:43:44

టీడీపీకి బిగ్ షాక్

ఎవ‌రెన్ని మాట‌లు చెప్పినా తాము తెలుగు దేశం పార్టీనే , ఎప్ప‌టికి సైకిల్ ల్లోనే ప్ర‌యాణం చేస్తామ‌ని,  చెప్పుకుంటూ ప్ర‌చారం చేసుకుంటారు కృష్టా జిల్లా ప్ర‌జ‌లు.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష‌నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా అక్క‌డ అడుగు వేయ‌డంతో రాజ‌కీయాల‌కు కొత్త క‌లర్ అంటుకుంది. గుంటూరుని త‌ల‌ద‌న్నే విధంగా కృష్ణా జిల్లాలో  పాద‌యాత్ర సాగుతోంది... ఇంత‌కు ముందు ఎప్పుడూ చూడ‌ని విధంగా ప్ర‌తీ గ్రామం నుంచి ప్ర‌జ‌లు జ‌గ‌న్ స్పీచ్ విన‌డానికి తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు.
 
స్టార్టింగ్ మొద‌లుకుని ఎండింగ్ వ‌ర‌కూ జ‌గ‌న్ స్పీచ్ ను వింటూ జ‌నాలు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.. అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న తప్పుల్ని ఒక్కొక్కటిగా ప్రజ‌ల‌కు వివ‌రిస్తూ... తిట్టిన తిట్టు తిట్టకుండా జగన్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు...అయితే ఆయ‌న  తిట్లకు జనం కేక‌లు వేస్తున్నారు.
 
ఇక దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌ను త‌ల‌ద‌న్నే విధంగా వైఎస్ జ‌గ‌న్ నిన్న కృష్ణా ప్ర‌జ‌ల‌కు సంచ‌ల‌న హామీ ప్ర‌క‌టించారు.. తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌తో పాటు కృష్ణా జిల్లాను మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్తాప‌కులు నంద‌మూరి తార‌క రామారావు జిల్లాగా మార్చుతాన‌ని హామీ ఇచ్చారు... ఈ హామీతో  2019 ఎన్నికల్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
 
అయితే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీని రాష్ట్ర ప్ర‌జ‌లుంద‌రూ ఆహ్వానించినా కానీ,  అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు మాత్రం ఆహ్వానించ‌డం లేదు... జ‌గ‌న్ కు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హ‌త లేద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు... ఇక మ‌రోవైపు తాము జ‌గ‌న్ కంటే ముందుగానే కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చాల‌నుకున్నామ‌ని ఈ విష‌యాన్ని జ‌గ‌న్ కాపీ  కొట్టార‌ని మ‌రికొంద‌రు నాయ‌కులు అంటున్నారు.
 
అయితే ఇదే విష‌యంపై సోష‌ల్ మీడియాలో నేటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు... వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి హామీని ప్ర‌క‌టించినా తాము ముందుగానే ఈ హామీని ప్ర‌క‌టించాల‌నుకున్నామ‌ని అయితే జ‌గ‌న్ త‌మ ద‌గ్గ‌ర నుంచి కాపీ కొట్టార‌ని టీడీపీ నాయ‌కులు అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేసుకోవ‌డం మాములేన‌ని అంటున్నారు.
 
దీని బట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ జిల్లా ప్ర‌జ‌ల‌కు కోపం వస్తే మాత్రం ఓట్లతో తాట తీయటం వారికి కొత్తేం కాదని విశ్లేష‌కులు అంటున్నారు..  16 సెగ్మెంట్ లు ఉన్న ఈ జిల్లా 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు, అలాగే టీడీపీకి ప‌ది అసెంబ్లీ స్థానాలు సాధించింది. ఇక వైయ‌స్సార్ హ‌యాంలో 2004లో ఈ జిల్లా నుంచి టీడీపీ కేవ‌లం రెండు అసెంబ్లీ సీట్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది... ఇక ఇదే ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌ర‌గ‌బోతుంద‌ని తాజా విశ్లేష‌కుల స‌మాచారం. 

షేర్ :

Comments

1 Comment

  1. Super jai jagan anna

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.