తాంత్రిక పూజ చేయించినందుకు ఈఓకి టీడీపీ సూప‌ర్ పోస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-10 18:09:08

తాంత్రిక పూజ చేయించినందుకు ఈఓకి టీడీపీ సూప‌ర్ పోస్ట్

భారతీయ జ‌న‌తాపార్టీ రాజ్య‌స‌భ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కేంద్ర బ‌లంతో జీవీఎల్ సుమారు 100 కోట్ల అవినీతికి పాల్ప‌డ్డారంటూ కొద్ది కాలంగా టీడీపీ నాయ‌కులు మీడియాను వేదిక‌గా చేసుకుని హైలెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వారు చేస్తున్న విమ‌ర్శ‌లపై బీజేపీ అధికార ప్ర‌తినిధి ఉమామ‌హేశ్వ‌ర రాజు మీడియా ద్వారా స్పందించారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, జీవీఎల్ వంద‌కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌ని కొద్ది కాలంగా టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అయితే వారికి ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాల‌ని ఆయన స‌వాల్ విసిరారు. జీవీఎల్ అవినీతికి పాల్ప‌డి ఉంటే రాష్ట్రంలో తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్నాము టీడీపీ నాయ‌కులు అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి సీబీఐ విచార‌ణ జ‌రిపిస్తే అవినీతికి పాల్ప‌డ్డారో లేదో తెలిసిపోతుంది క‌దా అని ఉమామ‌హేశ్వ‌ర రాజు స్ప‌ష్టం చేశారు. 
 
సీబీఐ విచార‌ణ చేయించ‌కుండా కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ది చేకూర్చుకునేందుకు మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిత్యం త‌మ పార్టీ బీసీల పార్టీ బీసీల కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెడ‌తామ‌ని చెప్పే మీరు ఇప్పుడు వారిపై క‌క్ష సాధిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
టీడీపీ నాయ‌కులు అధికారంలో ఉన్న‌ప్పుడు బీసీలంటే చేదు, అధికారంలో లేన‌ప్పుడు తీపి అని ఆయ‌న ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ నాయ‌కులు అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి వారికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని ఉమామ‌హేశ్వ‌ర రాజు ఆరోపించారు. సూర్య‌ల‌త బీసీ అయినందు వల్లే ఆమెను దుర్గ‌గుడి పాల‌క మండ‌లి స‌భ్యురాలి నుంచి తొల‌గించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. సూర్వ‌ల‌తపై నిర్వ‌హించిన‌ విచార‌ణ నివేదిక‌ను బ‌య‌ట‌పెడితే ఎక్క‌డ  తాంత్రికి పూజ నివేదిక బ‌య‌ట ప‌డుతుంద‌ని గ్ర‌హించి ఆ నివేదిక‌ను బ‌య‌ట పెట్ట‌డంలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
తాంత్రిక పూజ జ‌రిపించార‌ని లోకేశ్ పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ఆయ‌న ప్రశ్నించారు. అంతేకాదు తాంత్రిక పూజ చేయించిన దుర్గ‌గుడి ఆల‌య ఈఓ కు టీడీపీ అధిష్టానం మంచి పోస్ట్ కూడా ఇచ్చింద‌ని ఉమామ‌హేశ్వ‌ర మండిప‌డ్డారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.