స‌ర్కార్ అవినీతికి అడ్డువ‌స్తే బ‌దిలీ బ‌హూమ‌తి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-28 17:58:52

స‌ర్కార్ అవినీతికి అడ్డువ‌స్తే బ‌దిలీ బ‌హూమ‌తి

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల బాగుకోసం ఇసుక ఫ్రీ అని చెప్పారో... లేక త‌మ‌ ఎమ్మెల్యేలు బాగుకోసం ఫ్రీ అని చెప్పారో తెలియ‌దు కానీ, నాలుగు సంవ‌త్స‌రాల నుంచి విచ్చ‌ల విడిగా తెలుగు త‌మ్ముళ్లు ఇసుకు అక్ర‌మాలకు పాల్ప‌డుతున్నారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో సామాన్యుడికి ఇసుక దొర‌క‌డం లేదు. అధికార బలంతో చెరువులో ఉన్న మ‌ట్టిని త‌వ్వి ఇసుక బ‌ట్టీల‌ను అమ్ముకుని అధిక మొత్తంలో సొమ్మును పోగు చేసుకుంటున్నారు టీడీపీ నాయ‌కులు. 
 
ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇసుక దందా సుమారు నాలుగు సంవ‌త్సరాలుగా య‌దేచ్చ‌గా సాగుతోంది. వంగ‌ల‌పుడి రేవు నుంచి రాజ‌మండ్రి ధ‌వ‌ళేశ్వ‌రం, ఆత్రేయ‌పురం, జొన్న‌డా, పొడ‌గ‌ట్ల‌ప‌ల్లి, ఊట‌లంక‌, మద‌న‌ప‌ల్లి, గోపాల‌పురం, త‌పిలేశ్వ‌రం అయిన విల్లి ర్యాంపుల నుంచి యంత్రాల‌తో టీడీపీ నాయ‌కులు ఇసుక‌ను త‌వ్వేసుకుంటున్నారు. లారీలు ట్రాక్ట‌ర్ల ద్వారా ఇసుకను ర‌వాణ చేయిస్తు అందినంత వ‌ర‌కు తెలుగు త‌మ్ముళ్లు దోచేస్తున్నారు. 
 
నాలుగు సంవ‌త్స‌రాలుగా ఇసుక అంత‌ ప‌చ్చ చొక్కాలే తోడేస్తుండ‌టంతో సాధార‌ణ ప్ర‌జ‌లకు ఇసుకు దొర‌క‌డ‌మే క‌ష్టంగా మారుతోంది. రెండు యూనిట్ల ధ‌ర సుమారు 20వేలు ప‌లుకుతుందంటే ఇసుక మాఫియా ప‌రిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం అవుతోంది. దీంతో బిల్డ‌ర్లు కూడా ఇళ్ల నిర్మానాన్ని నిలిపి వెయ్య‌డంతో కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఇళ్ల నిర్మానానికి తెచ్చిన బ్యాంక్ లోనుల‌ను క‌ట్ట‌లేక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ప‌డుతున్నారు. 
 
దీంతో పాటు తెలుగు త‌మ్ముళ్లుకు చెరువులు కూడా వ‌ర‌ప్ర‌ధాయ‌నిగా మారాయి. నీరు చెట్టు ప‌థ‌కం కింద చెరువుల‌ను యంత్రాల‌తో త‌వ్వేస్తున్నారు. వారు త‌వ్విన మ‌ట్టిని గ్రామ అవ‌స‌రాల‌కు వినియోగించాల్సి ఉండ‌గా టీడీపీ నాయ‌కులు రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ల‌కు ఇటుక బట్టీ నేత‌ల‌కు అమ్ముకుని అక్ర‌మంగా ల‌క్ష‌ల‌ను సంపాదించుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా చేస్తున్నారు. జగ్గంపేట, ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పరిస్థితి మ‌రీ దారుణం. పోల‌వ‌రం ఎడ‌మ‌కాలువ మ‌ట్టిని కూడా తెలుగు త‌మ్ముళ్లు వ‌ద‌ల‌కున్నారు. గ‌ట్టుమీద వేసిని మట్టిసైతం తోడేసి రోడ్డు నిర్మాణాల‌కు వెంచ‌ర్ల‌కు వినియోగించారు. 
 
ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కూడా ఇదే ప‌రిస్థితి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 17 రిచ్  లు ఉన్నాయి అందులో అవురంగ‌బాద్, వాడ‌ప‌ల్లి. తాటిపుడి కోడూరు సిద్దాంతం, కోడూరు ఇసుక ర్యాంపులు టీడీపీ నాయ‌కులు జేబుల‌ను నింపుతున్నాయి. అంతేకాదు మంత్రి పితాని నియోజ‌క‌వ‌ర్గం అయిన ఆచంట‌లోను, అలాగే మంత్రి జ‌వ‌హ‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొవ్వురులోను ఇసుక అక్ర‌మ ర‌వాణ, అక్ర‌మ‌దందా న‌డుస్తోంది. ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి పితాని త‌న‌యుడు క‌నుస‌న్న‌ల్లో జోరుగా వ్యాపారం సాగుతోంద‌ని జిల్లా ప్ర‌జ‌లు వాపోతున్నారు. ఇసుక ర‌వాణాను అడ్డుకున్న అధికారుల‌కు బ‌దిలీని బ‌హూమానంగా ఇస్తున్నార‌ని చెబుతున్నారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.