బాబుకు షాక్ టీడీపీకి క‌న్న‌బాబు రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-30 17:31:34

బాబుకు షాక్ టీడీపీకి క‌న్న‌బాబు రాజీనామా

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌ త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ నాయ‌కులు కొంద‌రేమో ముంద‌స్తు రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇక మ‌రి కొంద‌రు అయితే ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు నాయుడు, అలాగే జిల్లా మంత్రులు త‌మ‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నే ఉద్దేశ్యంతో టీడీపీకి రాజీనామా చేస్తున్నారు. 
 
అయితే తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజ‌కవ‌ర్గానికి చెందిన టీడీపీ ఇంచార్జ్ క‌న్నబాబు పార్టీని వీడినట్లు తెలుస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న క‌న్న‌బాబు అక‌స్మాత్తుగా టీడీపీకి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక విష‌యాన్ని తెలుసుకున్న టీడీపీ అదిష్టానం హుటా హుటిన నెల్లూరుకు చేరుకుని క‌న్న‌బును బుజ్జ‌గించే కార్య‌క్రమాలు చేస్తున్నారు. అయినా కూడా క‌న్నబాబు అధిష్టానాన్ని లెక్క‌చెయ్య‌కున్నారు.
 
త‌న‌ను కాద‌ని ఆత్మ‌కూరు ఇంచార్జ్ గా మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని మంత్రి సోమిరెడ్డి ఎలా నియ‌మిస్తార‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేకపాటి గౌతంరెడ్డి చేతిలో ఓట‌మి పాలు అయిన క‌న్న‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే ఉద్దేశంతో వ్యూహాలు ర‌చిస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలో ఆదాల‌ను తెర‌పైకి తీసుకురావ‌డంతో మ‌న‌స్తాపానికి గురి అయిన క‌న్న‌బాబు టీడీపీకి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి నెల్లూరు టీడీపీ రాజ‌కీయం హాట్ టాపిక్ గా మారింద‌నే చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.