మ‌రో సీనియ‌ర్ గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 13:23:23

మ‌రో సీనియ‌ర్ గుడ్ బై

పార్టీ వీడే ప్ర‌శ‌క్తేలేదు అని చెప్పే నాయ‌కులు ఇప్పుడు ఏకంగా పార్టీ  మారి తెలుగుదేశానికి కౌంట‌ర్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే...మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి కూడా పార్టీ మారి తెలుగుదేశానికి షాక్ ఇచ్చారు.. తెలుగుదేశం అభివృద్దిని చూసి నాయ‌కులు పార్టీలోకి  వ‌స్తున్నారు అని చెబుతున్న తెలుగుదేశం అదే విధంగా అసంతృప్తి నాయ‌కులను బుజ్జ‌గించ‌లేక‌పోతోంది..
 
ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి య‌ల‌మంచిలి ర‌వి ఫిరాయించ‌డం మ‌రో కృష్ణా జిల్లా నేత కూడా రెడీగా ఉండ‌టం అలాగే ఆనం ఫ్యామిలీ కూడా వైసీపీలోకి చేర‌డానికి రెడీ అవుతున్నారు అనేది తెలుగుదేశానికి ఏప్రిల్ లో వ‌రుస షాక్ గురిచేస్తోంది.. ఇక ఈ స‌మ‌యంలో పాల‌న ఎలా ఉన్నా? సీనియ‌ర్ నాయ‌ల‌కును పార్టీ మార‌డానికి రెడీగా ఉన్న నాయ‌కుల‌ను  బుజ్జ‌గించ‌డంలోనే తెలుగుదేశం అధినేత శ్ర‌మ ఎక్కువగా క‌నిపిస్తోంది.
 
ఇక తెలుగుదేశానికి మ‌రో సీనియ‌ర్ కూడా పార్టీని వీడే యోచ‌న‌లో ఉన్నారు అని తెలుస్తోంది...ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారట‌..  ముఖ్యంగా ఆయ‌న పార్టీ మారాలి అని అనుకుంటున్నారు అని వార్త‌లు ఇప్పటికే వినిపిస్తున్నాయి...ఇక సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌తో మాట్లాడారు అని తెలుస్తోంది.. అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడిన ఆయ‌న ఎటువంటి నిర్ణ‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు అని అంటున్నారు.. ఇక పార్టీలో సీనియ‌ర్ల‌కు స‌రైన గౌరవం లేద‌ని అలాంటి స‌మ‌యంలో తాము పార్టీలో ఉండ‌టం ఎందుకు అని ఆయ‌న మ‌ద‌న‌ప‌డుతున్నార‌ట‌.
 
ఇప్ప‌టికే నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక‌వ‌ర్గం నాయ‌కులు వ‌రుస పెట్టి తెలుగుదేశానికి షాక్ ఇస్తున్నారు.. ఈ స‌మ‌యంలో ఆదాల కూడా పార్టీకి గుడ్ బై చెబుతారా అని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.. ఆయ‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ అలానే ఉంది అంటున్నారు. ఇక మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డితో ఆయ‌న‌కు వివాదాలు ఉన్నాయి అని అంటున్నారు.
 
జిల్లాకు చెందిన మరో మంత్రి నారాయ‌ణ ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆయ‌న పార్టీలో కొన‌సాగే ఆలోచ‌న‌కు సుముఖత వ్య‌క్తం చేయ‌డం లేదు అని తెలుస్తోంది... ఇక చంద్ర‌బాబు మాత్రం హామీ ఇచ్చార‌ట, త‌ప్ప‌క న్యాయం చేస్తాం అని.. అలాగే తొంద‌ర‌ప‌డి ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు అని తెలియ‌చేశారు అట.. అయితే ఆయన త‌న డెసిష‌న్ మాత్రం తెలియ‌చేయ‌లేదు అని తెలుస్తోంది...
 
ఇక రాయ‌ల‌సీమ నాయ‌కులు చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి కూడా త‌న నిర్ణ‌యం చెప్ప‌డం, సీఎం తో మాట్లాడినా ఆయ‌న త‌న నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోలేద‌ట... ఆర్టీసి క‌డ‌ప రీజియ‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని ఆయ‌న తీసుకోను అని తెలియ‌చేశారు అని తెలుస్తోంది. మ‌రి ఆదాల పై  కూడా గ‌తం నుంచి వినిపిస్తున్న విష‌య‌మే? మ‌రి పార్టీ మార్పుపై  ఎటువంటి నిర్ణ‌యం  తీసుకుంటారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.