టీడీపీ నేత రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-27 16:16:58

టీడీపీ నేత రాజీనామా

2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో సుమారు 600 కు పైగా హామీల‌ను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించి అధికారాన్ని సొంతం చేసుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇప్పుడు న‌లువైపుల నుంచి పార్టీ నాయ‌కులు అసంతృప్తిని తెలియ‌జేస్తున్నారు... టీడీపీ నాయ‌కుల‌కు కేటాయించిన ప‌ద‌వుల‌ను చంద్ర‌బాబు వారికి ఇవ్వ‌కుండా వేరే  వారికి కేటాయించ‌డంపై తీవ్ర స్థాయిలో ముఖ్య‌మంత్రి పై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.
 
ఇక తాజాగా టీడీపీపై ముస్లిం నేత‌లు కూడా వ్య‌తిరేక‌త చూపుతున్నారు...  మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు అమీర్‌ బాబు కు గతంలో రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్ ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పిన‌ చంద్ర‌బాబు... అత‌నిని నియ‌మించ‌కుండా విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే  బికాం లో ఫిజిక్స్  తో పేరు తెచ్చుకున్న జ‌లీల్ ఖాన్ కు ఈ ప‌ద‌విని అప్ప‌గించారు... దీంతో మ‌న‌స్తాపానికి గురి అయిన అమీర్ త‌న‌కు కేటాయించిన ప‌ద‌వికి రాజీనామా చేసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో త‌న అసంతృప్తిని తెలిపారు..ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే మధ్యలోనే  త‌న రాజీనామాను బాబుకు అంద‌జేసి అక్క‌డినుంచి అమీర్ వెళ్లిపోయారు.
 
గ‌త 25 సంవ‌త్స‌రాల నుంచి తెలుగుదేశం పార్టీలో మంచి న‌మ్మ‌క‌స్తుడిగా అమీర్ బాబు వ్య‌వ‌హ‌రించినా కాని త‌న‌ను పార్టీ గుర్తించ‌కపోవ‌డం చాలా దురదృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు... త‌న‌కు కేటాయిస్తామ‌ని చెప్పిన‌ వ‌క్ఫ్‌ బోర్డు చైర్మన్‌ పదవి ఇవ్వకుండా చంద్ర‌బాబు మోసం చేశారని అమీర్ బాబు వ్యాఖ్యానించారు. 
 
అయితే మ‌రో వైపు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌లపెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి టీడీపీ నాయ‌కులు కూడా వైసీపీ గూటికి  రావాలి అని భావిస్తున్నారు... ఈ యాత్ర‌లో భాగంగా ఇప్ప‌టికే అనేక ప్రాంతాల ప్ర‌జ‌లు జ‌గ‌న్ స‌మ‌క్షంలో సైకిల్ పార్టీని వీడి ఫ్యాన్ చెంత‌కు చేరుతున్నారు...ఇక వీరితో పాటు  మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు అమీర్‌ బాబు కూడా జ‌గ‌న్ గుంటూరు నుంచి పాద‌యాత్ర పూర్తి చేసుకుని కృష్ణాలోకి వ‌చ్చిన వెంట‌నే  ఫ్యాన్ పార్టీలో చేర‌తారు అని వార్త‌లు వ‌స్తున్నాయి...
 
ఒక వేల అమీర్ వైసీపీలోకి చేరితే విజ‌య‌వాడ‌లో  ముస్లిం ఓట్లు టీడీపీ కోల్పోవల‌సిన  ప‌రిస్థితి ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మైనార్టీల‌కే వైసీపీ పెద్ద పీట వేసింది పార్టీ మారినవారిలో ఇద్ద‌రు మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఇక ఇటీవ‌ల కర్నూలు సీటు కూడా వైసీపీ తర‌పున జ‌గ‌న్  మైనార్టీకి ఇచ్చారు.. దీంతో మైనార్టీ ఓట్లు వైసీపీకి మ‌రింత ప్ల‌స్ కానున్నాయి అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.