మ‌హిళ‌ను రేప్ చేసిన టీడీపీ నేత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp leader raped woman image
Updated:  2018-02-26 12:49:25

మ‌హిళ‌ను రేప్ చేసిన టీడీపీ నేత

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగు దేశం పార్టీ నాయ‌కులు అధికారం అండ చూసుకోని అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే... ప‌లు చోట్ల అమాయ‌క మ‌హిళ‌ల అవ‌స‌రాల‌ను  అవ‌కాశంగా  మార్చుకుని  శారీర‌కంగా లొంగ‌దీసుకునుంటున్నారు అధికార  పార్టీ  నాయ‌కులు... ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా  టీడీపీ నాయ‌కులు హ‌త్య‌లు,ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆరోప‌ణ‌లు వెళ్లువెత్తుతున్నాయి... అయితే ఈ క్ర‌మంలో మ‌రోసారి ఇలాంటి దారుణం క‌డ‌ప జిల్లాలో వెలుగు చూసింది... ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ అమాయ‌క మ‌హిళ‌ల‌పై టీడీపీ నేత రేప్ చేసిన తీరు రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతుంది...
 
క‌డ‌ప జిల్లాకు చెందిన ఓ మ‌హిళ త‌న త‌ల్లి దండ్రులు చ‌నిపోవ‌డంతో ఉద్యోగ రిత్యా  గ‌త ఐదు నెల‌లుగా క‌డ‌ప హాస్ట‌ల్ ల్లో ఉంటూ ఓ ఆసుప‌త్రిలో ప‌ని చేసుకుంటూ  త‌న జీవ‌నం  సాగిస్తోంది. ఇంత‌లో ఆ యువ‌తికి ఖ‌రీదుల్లాతో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌డంతో అత‌ని ద్వారా ఆప్కో చైర్మ‌న్ గుజ్జ‌ల శ్రీనివాస్ తండ్రి గుజ్జుల రామ‌కృష్ణ‌తో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తామ‌ని, ఆయ‌న వ‌ద్ద‌కు తీసుకు వెళ్లార‌ని తెలిపింది...దీంతో త‌న‌కు మంచి రోజులు క‌లిసోస్తున్నాయ‌ని భావించి ఆ యువ‌తి సంతోష ప‌డింది..
 
అదే స‌మ‌యంలో మైనార్టీ కార్పొరేష‌న్ త‌రుపున ఆ యువ‌తికి కుట్టు మిష‌న్ ఇప్పిస్తామ‌ని నాలుగు మాయ‌మాట‌లు చెప్పి, అలాగే త‌న కుమారుడు చైర్మ‌న్ గా ఉన్న చోట త‌న‌కు ఉద్యోగం ఇప్పిస్తామ‌ని  త‌న‌ నివాసానికి ఆ యువ‌తిని ర‌ప్పించుకున్న‌డు చైర్మ‌న్ శ్రీనివాస్...  ఆ త‌ర్వాత తాను ఇంట్లోకి వెల్ల‌గానే బ‌ల‌వంతంగా రేపే చేశాడ‌ని బాధిత యువ‌తి  పేర్కొంది... వ‌య‌సులో మీకు కూతురు లాంటి దానిన‌ని వేడుకున్నా  వ‌ద‌ల్లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది.
 
ఆ స‌మ‌యంలో ఆమెతో స‌న్నిహితంగా ఉన్న దృశ్యాల‌ను ర‌హ‌స్యంగా తీశాన‌ని, త‌న ద‌గ్గ‌ర‌కు రాక‌పోతే ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తాన‌ని బేదిరించి అనేక సార్లు చైర్మ‌న్ త‌న‌పై అత్యాచారం చేశార‌ని ఆ యువ‌తి సోమాజీ గూడా ప్రెస్ క్ల‌బ్ లో తెలిపింది.... అంతే కాకుండా పలువురి వద్దకు తనను పంపాడని కూడా వెల్లడించింది.
 
త‌న‌కు  జ‌రిగిన అన్యాయంపై కొద్ది రోజుల క్రితం కడ‌ప వ‌న్ టౌన్ పోలీస్ అధికారుల‌కు తెలియ‌జేస్తే ఆప్కో చైర్మ‌న్ పై  ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని చెప్పింది... అధికారం అండ‌తో త‌న‌కు 50 వేల రూపాయ‌లు ఇస్తామ‌ని నోరు మూసుకుని సైలెంట్ గా ఉండని పోలీస్ అధికారితో చెప్పించార‌ని,  త‌న జీవితాన్ని నాశ‌నం చేసిన వారి శిక్షించాల‌ని మీడియా ద్వారా ఆ యువ‌తి  కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.