టీడీపీ నేత ఏం చేశాడో మీరే చూడండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan prajasankalpa yatra
Updated:  2018-05-30 18:09:15

టీడీపీ నేత ఏం చేశాడో మీరే చూడండి

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ మందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర 176 వ రోజుకు చేరుకుంది. 2017 న‌వంబ‌ర్ 6న జ‌గ‌న్ ఇడుపుల‌పాయ‌లో మొద‌లుపెట్టిన ఈ పాద‌యాత్ర నేడు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. 
 
లిఖితపూడి, సరిపల్లి మీదుగా జ‌గ‌న్ పాదయాత్ర చేస్తున్న నేప‌థ్యంలో మురళీకృష్ణ అనే టీడీపీ కార్యకర్త జననేతను కలుసుకుని తన కష్టాన్ని చెప్పుకున్నాడు. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితే త‌న‌కు జాబ్ వ‌స్తుంద‌నే ఉద్దేశంతో టీడీపీ జెండా క‌ట్ట‌డం నుంచి ప్ర‌తీ ఇంటికి తిరిగి ప్ర‌చారం చేశాన‌ని ఆయ‌న గెలుపుకు త‌న‌వంతు కృషిచేసినా కూడా టీడీపీ ప్ర‌భుత్వం త‌న‌కు జాబ్ ఇవ్వ‌లేద‌ని జ‌గ‌న్ తో త‌న ఆవేద‌న‌ను చెప్పుకున్నారు.
 
ఈ మ‌ధ్య‌కాలంలో తాను ఉద్యోగం కోసం వెళ్తే మూడు లక్షలు ఇస్తే నీకు విజయవాడ కార్పొరేషన్ లో అయినా లేక మంగళగిరి రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో అయినా  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగంలో పెట్టిస్తామని చెబుతున్నారని అన్నారు. అయితే  త‌న‌ దగ్గర అంత స్థోమత లేదు అంటూ ఆ యువకుడు జ‌గ‌న్ తో చెప్పుకొచ్చాడు. ఇక అత‌ని బాధ‌ విన్న జ‌గ‌న్ వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తీ నిరుద్యోగిని ఆదుకుంటుంద‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
 
అయితే ఇదే క్ర‌మంలో మురళీకృష్ణ త‌న‌ను టీడీపీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌నే కోపంతో త‌నకు కేటాయించిన  టీడీపీ మెంబ‌ర్ షిప్ కార్డు అక్క‌ర్లేద‌ని జ‌గ‌న్ ఎదుట‌ చించేసి, చంద్ర‌బాబు నాయుడు చూడు అంటూ నేల‌కేసి ఆ కార్డును తొక్కాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.