టీడీపీకి మ‌రో కీల‌క నేత గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 01:16:42

టీడీపీకి మ‌రో కీల‌క నేత గుడ్ బై

తెలుగుదేశం పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని ప‌రిణామాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. టీడీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని,   రాజీనామా చేసి వ‌స్తే  ఆహ్వానించేందుకు  సిద్దంగా ఉన్నామ‌ని విజ‌య‌సాయి రెడ్డి ఇటీవ‌ల   చేసిన ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 
 
మరోవైపు తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రుగా జంప్ అవుతూ ఉన్నారు. ఈ వ‌రుసలో ఇప్పుడు టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి   సైకిల్ దిగేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. 
 
గ‌త ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నుండి  టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన ప్ర‌తాప్ రెడ్డి, కేసిఆర్ కు గ‌ట్టి పోటీనిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన న‌ర్సా రెడ్డి టీఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయ‌న‌కు రోడ్డు డెవలప్ మెంట్  కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్ట‌బెట్టింది టీఆర్ ఎస్ పార్టీ.
 
దీంతో గ‌జ్వేల్ లో బ‌ల‌మైన నాయ‌కుడి కోసం అన్వేషించిన కాంగ్రెస్ పార్టీ వంటేరు ప్ర‌తాప్ రెడ్డిపై క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తాప్ రెడ్డి పార్టీ మారేందుకు క‌స‌ర‌త్తులు పూర్తి అయ్యాయ‌ని, వ‌చ్చే నెల‌లో సైకిల్ దిగి కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నార‌ని స‌మాచారం. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.