బాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ నేత కోలుకోవ‌డం క‌ష్ట‌మే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-09-10 03:32:34

బాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ నేత కోలుకోవ‌డం క‌ష్ట‌మే

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా రాజ‌కీయాలు రోజుకు ఒక మ‌లుపు తిరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ తెలుగుదేశంపార్టీకి చెందిన బీసీ సంఘ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్య టీడీకీ రాజీనామా చేసిన‌టట్లు తెలుస్తోంది. ఇక ఇదే విష‌యంపై ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు.
 
త‌న‌ను చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా పార్టీలోకి చేర్చుకుని, ఆ త‌ర్వాత‌ త‌న‌కు క‌నీస మ‌ర్యాద కూడా ఇవ్వ‌లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు ఇటీవ‌లే జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుల విష‌యంలో త‌న‌ను ఆహ్వానించ‌లేద‌ని  అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. రిజ‌ర్వేష‌న్ల పేరుతో ఇటు కాపుల‌ను అటు బీసీల‌ను టీడీపీ మోసం చేసింద‌ని  ఆరోపించారు. 

షేర్ :

Comments