జ‌న‌సేన‌లోకి టీడీపీ నేత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-15 04:23:55

జ‌న‌సేన‌లోకి టీడీపీ నేత

2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు గ‌ట్టిపోటీ ఇవ్వాల‌నే ఉద్దేశంతో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొద్ది కాలంగా రాష్ట్రంలో బ‌స్సు యాత్ర పేరుతో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ యాత్ర ఉద్య‌మాల పురిటిగ‌డ్డ ఉత్త‌రాంధ్ర‌ను అలాగే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌ను ప‌వ‌న్ పూర్తి చేసుకున్నారు.
 
 ఇక ఈ యాత్ర‌లో భాగంగా తాజాగా  ప‌వ‌న్ విశాఖ జిల్లాకు ప‌ర్య‌టించారు. ఈ పర్య‌ట‌న‌లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సుంద‌ర‌పు విజ‌యకుమార్ ప‌వ‌న్ ను క‌లుసుకున్నారు. దీంతో ఆయ‌న‌ మ‌రికొద్ది రోజుల్లో జ‌న‌సేన తీర్థం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నాకూడా ఆయ‌న పార్టీ మార‌డం ప‌ట్ల జిల్లా ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.  
 
విజ‌యకుమార్ కొద్దికాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో త‌న‌కుస్థానం ద‌క్క‌క‌పోవ‌డంపై విజ‌య్ కొద్దికాలంగా పార్టీపై నిరాశ‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేశ్ ద‌గ్గ‌ర వివ‌రించారు. అయితే లోకేష్ కేవ‌లం ఆయ‌న‌ను బుజ్జ‌గించారు త‌ప్ప విజ‌య్ కు ఎలాంటి స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌క‌పోవ‌డంతో తాజాగా ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాన్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీ తీర్థం తీసుకోనున్నారని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.