ఎంతైనా జ‌గన్ సూప‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-01 18:37:08

ఎంతైనా జ‌గన్ సూప‌ర్

ప్ర‌జా స‌మ‌స్య‌లే త‌న స‌మ‌స్య‌గా భావించి ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే  ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌పై నిరంతరం పోరాడుతూనే ఉంటారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అయితే ఈ పోరాటాల‌న్ని జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో అధికారం కోసం పావులు క‌దుపుతున్నార‌ని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు.అధికారం కోసం అయితే జ‌గ‌న్ పాద‌య‌త్ర చేయాల్సిన అవ‌స‌రం లేదు త‌న‌కున్న ప్ర‌జా బ‌లంతో ఏదో ఒక చోట భారీ భ‌హిరంగ స‌భను ఏర్పాటు చేసి ఆచ‌ర‌ణ‌కు స‌గం సాధ్య‌మ‌య్యే నాలుగు హామీల‌ను ప్ర‌క‌టిస్తే చాలు జ‌నాలు ఎగేసుకుని ఓట్లు వేస్తారు. 
 
కానీ జ‌గ‌న్ అలా  చేయ‌లేదు ఆయ‌న అధికారంలోకి వ‌స్తే తాను పూర్తిగా అమ‌లు చేయ‌బోయే హామీల‌ను మాత్ర‌మే జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. అలాగే దీంతో పాటు గ‌తంలో రాజ‌న్న ప‌రిపాల‌న ఎలా ఉందో తాను కూడా అలానే ప‌రిపాల‌న చేస్తాన‌ని అంటున్నారు. 
 
అందుకే త‌న తండ్రి ఎలాగైతే ప్ర‌జా సేవ‌చేయాల‌నే ఉద్దేశ్యంతో రాష్ట్ర‌మంతా పాద‌యాత్ర చేశారో ఇప్పుడు అదే మాదిరిగా జ‌గ‌న్ కూడా పాద‌యాత్ర చేస్తున్నారు. ఎవ‌రైనా ఈ ఎర్ర‌ని ఎండాకాలంలో ప‌ది కిలో మీట‌ర్లు నడిస్తే చాలు నా ప‌ని అయిపోయింది దేవుడా అనే స్థితికి చేరుతారు. కానీ జ‌గ‌న్ మాత్రం ఎనిమిది నెల‌ల‌పాటు గ్యాప్ లేకుండా 2,200 కిలో మీటర్ల‌కు పైగా పాద‌యాత్ర చేస్తున్నారు. 
 
ఇంకా ఎనిమిది వంద‌ల కిలో మీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేయాలి.. చుట్టూ జనం, దుమ్ము, ధూళీ అభిమానంతోనే అయినా అతి దగ్గరగా వస్తారందరూ ముందుకు కదలనివ్వరు. షేక్ హ్యాండ్లు, సెల్ఫీలు, ప్రేమలు అభిమానులు అంత మంది ఒక్కసారిగా మూగితే తట్టుకోవడం ఎవరికైనా కష్టం కానీ ఒక్క జ‌గ‌న్ వల్లే సాధ్యం అవుతోంది.
 
ఇక ఈ ప్ర‌జాద‌ర‌ణ చూసి తెలుగుదేశం పార్టీ నాయ‌కులు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీల‌పై దృష్టి పెట్టారు. అందుకు మ‌హానాడు వేధిక‌గా చేసుకుని టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీలు అమ‌లు చేయాలంటే వేల కోట్ల కావాల‌ని ఇది ఆచ‌ర‌ణ‌కు సాధ్యం కాని హామీలంటూ ప్ర‌చారం చేస్తున్నారు. 
 
దీంతో జ‌గ‌న్ హామీలు ఆచ‌ర‌ణ‌కు సాధ్యం అయ్యే విధంగా ఉన్నాయా లేదా అన్న‌విష‌యంపై  రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌ర్చించారు. ఈ చ‌ర్చ ముగిసిన త‌ర్వాత జ‌గ‌న్ హామీలు నూటికి నూరు శాతం ఆచ‌ర‌ణ‌కు సాధ్య‌మ‌య్యే విధంగా ఉన్నాయ‌ని తేల్చిచెప్పారు. ఇక ఈ విష‌యం బ‌య‌టప‌డ‌టంతో టీడీపీ నాయ‌కులంతా డైల‌మాలో ప‌డ్డార‌ట‌.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.