బాబు సైకిల్ పంక్చర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-18 16:13:11

బాబు సైకిల్ పంక్చర్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని నవంబ‌ర్ 6, 2017న త‌న సొంత జిల్లా వైయ‌స్సార్ క‌డ‌ప జిల్లా నుంచి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర మొద‌లు పెట్టిన సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే.
 
ఇక‌ ఈ సంకల్ప‌యాత్ర ఇప్ప‌టికే ఎనిమిది జిల్లాల‌ను పూర్తి చేసుకుని అశేష జ‌న‌వాహినితో ప‌శ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టింది. అయితే గ‌తంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఈ సంక‌ల్ప‌యాత్ర కేవ‌లం రాయ‌ల‌సీమ‌కు మాత్ర‌మే అంకితం అవుతుంద‌ని భావించారు. అయితే టీడీపీ నాయ‌కులు ఆలోచ‌న‌ల‌ను తిప్పికొట్టేలా వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్ప‌యాత్ర‌ను చేప‌డుతున్నారు.
 
ఇక 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌నే భ‌యంతో టీడీపీ నాయ‌కులు రాష్ట్రంలో సైకిల్ యాత్ర, మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను సెగ్మెంట్ ల వారీగా చేప‌డుతున్నారు. అయితే వీరు ఎన్ని స‌భ‌ల‌ను ఏర్పాటు చేసినా జ‌గ‌న్ ప్రజా సంక‌ల్ప‌యాత్ర‌కు మాత్రం పోటీ ప‌డ‌లేక‌పోతున్నారు. గ‌తంలో సైకిల్ యాత్ర‌పేరుతో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైకిల్ యాత్ర‌ను చేప‌ట్టారు. అయితే వారు చేప‌ట్టిన యాత్ర ఒక్క‌రోజుకే ఒక‌రికి గుండెపోటు, మ‌రొక‌రికి అప‌శృతి, ఇంకొక‌రికేమో గాయాలు ఇలా ప్ర‌తీ ఇక్క‌రికి ఏదో సంఘ‌ట‌నలు చోటుచేసుకోవ‌డంతో సైకిల్ యాత్ర‌ను అర్థాంత‌రంగా ముగించారు.
 
ఇక ఈ నేప‌థ్యంలో సెగ్మెంట్ ల వారీగా 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేయ‌నున్న అభ్య‌ర్థులు మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ స‌భ‌లు కూడా మ‌ధ్య‌లోనే ముగుస్తున్నాయి . కార‌ణం టీడీపీ నాయ‌కులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి తామంటే తాము హైలెట్ అంటూ కాల‌ర్ ఎగ‌రేసుకుంటూ స‌భ‌లో తిరుగుతుండ‌డంతో టీడీపీ నాయ‌కుల‌ మధ్య విభేదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇక ఈ వ‌ర్గ విభేదాల వ‌రుస‌లో రాయ‌ల‌సీమ మొద‌టి స్థానంలో ఉంది. 
 
మ‌రో వైపు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా నిన్న విశాఖ‌ప‌ట్నంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి శ్రీకాకుళం నుంచి బ‌స్సు యాత్ర‌ను చేప‌డుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో టీడీపీ నాయ‌కులు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితికి చేరుకున్నారు. ఇక ఇంత‌లోనే  టీడీపీ నాయ‌కుల సైకిల్ కూడా పంక్చర్ అయిన‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.