తెర‌పై టీడీపీ దందా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-14 01:22:46

తెర‌పై టీడీపీ దందా

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన అన్నా క్యాంటిన్లు కాస్త విరాళాల క్యాంటిన్ గా మూరుతున్నాయి. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాము అధికారంలోకి వ‌స్తే పేద‌ల‌కు మూడుపూట‌లా నాణ్య‌మైన భోజ‌నం అందిస్తామ‌ని అది కూడా త‌క్కువ‌ ధ‌ర‌కే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అన్నా క్యాంటిన్లు పేరిట ఏర్పాటు చేసి భోజ‌నం అందిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నాలుగు సంవ‌త్స‌రాల పాటు అన్నా క్యాంటిన్ గురించి ఊసే ఎత్త‌లేదు. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో పేద‌ల ఆక‌లి కాకుండా త‌మ‌కు ఓట్ల ఆక‌లి వ‌చ్చిన‌ట్లు అన్నా క్యాంటిన్లు బాబుగారికి ఉన్న ఫ‌లంగా గుర్తుకు వ‌చ్చాయా అని రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటిన్ల‌ను ప్రాంభించాల‌ని టీడీపీ స‌ర్కార్ నిర్ణ‌యించింద‌ట‌. అయితే తొలివిడత‌గా వాటిలో 60క్యాంటిన్ల‌ను చంద్ర‌బాబు ప్రారంభించారు. అయితే ఒక్కొక్క క్యాంటిన్ కు రాష్ట్ర ప్ర‌భుత్వం కోటిరుపాయ‌ల‌కు పైగా కేటాయించి అందులో 203 క్యాంటిన్స్ కు గాను 205 కోట్ల‌ను కేటాయించారు. అంటే ఒక్కొక్క అన్నా క్యాంటిన్ కు కోటి రూపాయాలను కేటాచించింది.  
 
అయితే గ్రీన‌రీ, ప్ర‌హ‌రి పేరిట తెలుగు త‌మ్ముళ్లు అక్ష‌రాల అర‌కోటిని మింగేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక చంద్రబాబు మాత్రం అన్నా క్యాంటిన్ నిర్వాహ‌ణ‌కు సంబంధించి ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా ముందుకు వ‌చ్చి విరాళాలు ఇవ్వాల‌ని పిలుపునిస్తున్నార‌ట‌. అన్నా క్యాంటిన్ ఏర్పాటులో చంద్ర‌బాబు క‌నుసైగ‌ల‌తోనే తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌జా ధ‌నాన్ని దోచేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఒక వైపు టీడీపీ నాయ‌కులు ప్ర‌జాధ‌నాన్ని తినేస్తునే మ‌రోవైపు అన్నా క్యాంటిన్ల నిర్వ‌హణ‌కు ప్ర‌జ‌లు విరాళాలు ఇవ్వండి అన‌డం విమ‌ర్శ‌లకు తావు ఇస్తోంది. 
 
అన్నా క్యాంటిన్స్ పేరుతో చేస్తున్న‌ది చాల‌క ఇంకా ప్ర‌జ‌లు ఇచ్చే విరాళాల‌ను కూడా తినేయ‌టానికి టీడీపీ నేత‌లు సిద్ద‌మ‌వుతున్నార‌ని వారిపై ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తుతున్నాయి. చంద్ర‌బాబు ఇలా చందాలు అడ‌గ‌టం ఇదేమి తొలిసారి కాద‌ని ప‌లువురు గుర్తుచేస్తున్నారు. గ‌తంలో రాజ‌ధాని నిర్మాణం కోసం మై అమ‌రావ‌తి, మై రాజ‌ధాని పేరుతో చంద్ర‌బాబు ఇటుక‌ల‌పేరుతో చందాలు వసూళ్లు చేశార‌ని మండిప‌డుతున్నారు. హైద‌రాబాద్ స‌చివాల‌యంతోపాటు రాష్ట్రంలో కొన్నిచోట్ల ఏకంగా హుండీల‌ను ఏర్పాటు చేసి అధికారికంగా చందా దందాకు దిగారు బాబు అండ్ బ్యాచ్. 
 
ఇక చివ‌రికి పాఠ‌శాల విద్యార్థుల‌ను కూడా చంద్ర‌బాబు వ‌ద‌ల్లేదు రాజ‌ధాని నిర్మాణం కోసం ఒక్కో విద్యార్థి ప‌దిరూపాల‌యు ఇవ్వాల‌ని జీవోను కూడా ఇప్పించారు. అయితే ఈ విష‌యంపై అప్ప‌ట్లో పెద్ద దుమార‌మే రేగింది. చంద్ర‌బాబుకు రాజ‌ధాని కోసం ఇటుక‌లపేరిట ఇచ్చిన డ‌బ్బును, రాజ‌ధాని నిర్మాణంకోసం హుండీలో ప‌డ్డ కానుక‌లు ఏమ‌య్యాయో ఆ హుండీ రాయుళ్ల‌కే తెలియాల‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.