టీడీపీలో ప్ర‌శాంత్ కిషోర్లు పెరిగిపోయారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:48:04

టీడీపీలో ప్ర‌శాంత్ కిషోర్లు పెరిగిపోయారు

వైసీపీకి ఉత్త‌రాధి రాజ‌కీయం అంటుకుంది అని విమ‌ర్శ‌లు చేస్తుంటారు తెలుగుదేశం నాయ‌కులు.. అయితే జ‌గ‌న్ మోడ్ర‌న్ కాబ‌ట్టి మోడ్ర‌న్ రాజ‌కీయ వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ను పార్టీ త‌ర‌పున వ్యూహాక‌ర్త‌గా పెట్టుకున్నారు అని అంటున్నారు... అయితే ప్ర‌శాంత్ కిషోర్ వ‌చ్చిన తొలిరోజే జ‌గ‌న్ ప‌రిచ‌యం చేశాడు, దీంతో టీడీపీకి జ‌డివాన కురిసినంత పనైంది... తొలిరోజే జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు దాడి పెంచారు... జ‌గ‌న్ వ్యూహాలు  సొంత నిర్ణ‌యాలు తీసుకోలేరు అందుకే ఇలా ప్ర‌శాంత్ ని తీసుకుని రాజ‌కీయాల్లో తేజోవంతుడు అవ్వాలి అని అనుకుంటున్నారు అని విమ‌ర్శ‌లు చేశారు..
 
మాకు లోకేష్ లాంటి నాయ‌కులు ఉంటే  ఎంత మంది ప్ర‌శాంత్ కిషోర్లు ఉన్నా తెలుగుదేశం వ్యూహాల ముందు నిల‌బ‌డ‌లేరు అని వైసీపీ పై కౌంట‌ర్లువేశారు..  ఓవ‌ర్ల రామ‌య్య, రాజేంద్ర‌ప్ర‌సాద్, దేవినేని ఉమా, బోండా ఉమా, ఇలా చెప్పుకుంటూ పోతే లోకేష్  పేరు త‌ల‌చ‌ని నాయ‌కులు ఎవ‌రూ లేరు  అనే చెప్పాలి..
 
జ‌గ‌న్ వెనుక ఉంది కేవ‌లం  ఒక్క‌డు ప్ర‌శాంత్ కిషోర్ మాత్ర‌మే,  ఆయ‌న పార్టీకి ఇచ్చే స‌ల‌హాలు సూచ‌న‌ల‌తోనే వైసీపీ గెలుస్తుంది అనేది టీడీపీ విమ‌ర్శ‌.. అయితే జ‌నాక‌ర్ష‌న ఉండాలి పార్టీ త‌ర‌పున స‌రైన ప్ర‌ణాళికా అన్నింటికంటే ముఖ్య‌మైన‌ది స‌రైన అభ్య‌ర్దులు ఉండాలి ఇవేమీ టీడీపీ ఆలోచించ‌కుండా పీకే టీంనే విమ‌ర్శించ‌డం ప‌నిగా పెట్టుకుంటుంది.
 
టీడీపీలో చాలా మంది ప్ర‌శాంత్ కిషోర్లు ఉన్నారు ఇటీవ‌ల కొత్త వార్త‌లు వ‌స్తున్నాయి.. వారి ఆలోచ‌న‌లు సూచ‌న‌లు తీసుకుని ముందుకు వెళ్లాలి అని స‌ద‌రు యువ మంత్రి ఆలోచ‌న‌ట... తెలుగుదేశం రాజ‌కీయాలు చూస్తుంటే ఆలోచించేవారు ఎక్కువ ఆచ‌రించేవారు త‌క్కువ అంటున్నారు సొతం గూటి నేతలు.. కాని క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అడ్ర‌స్ తెలుగుదేశం పార్టీ అనేది ఇప్ప‌టికీ న‌మ్మాల్సిందేన‌ట‌.
 
అయితే ప్ర‌శాంత్ కిషోర్ టీం ఆలోచ‌న సోష‌ల్ మీడియాలో ఎలా ఉంది, వారి టార్గెట్ ఏమిటి, స్ట్రాట‌జీ ఏమిటి, అనేది తెలుగుదేశం ఈ నాలుగు నెల‌లుగా బాగా అబ్జ‌ర్వ్ చేసింది.. ఎవ‌రి స్ట్రాట‌జీ వారు చెప్ప‌డం అన్నీ కొత్త‌గా ఉండ‌టంతో ఇది పీకే స్ట్రాట‌జీలా ఉంది అన‌డం, వారికి బిరుదులు ఇవ్వ‌డం జ‌రిగిపోతున్నాయి పార్టీలో..
 
ఏమైనా దేశ‌రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు సీనియ‌ర్ అని అంద‌రికి తెలిసిందే.. కాదు అన్నా చెప్పడానికి మీడియాలు ఉన్నాయి.. అందుకే ప్ర‌శాంత్ కిషోర్ లాంటి స్ట్రాట‌జీస్టులు ఎన్ని స‌ల‌హాలు ఇచ్చినా బాబు స‌ల‌హాల ముందు బ‌లాదూర్ అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు.. జిల్లాకు వ‌చ్చి ముగ్గురు ప్ర‌శాంత్ కిషోర్లు టీడీపీ త‌ర‌పున త‌యారు అవుతున్నార‌ట ...చూడాలి 39 మంది స్ట్రాట‌జీల‌తో తెలుగుదేశం పీకే టీం నిఎదురుకుంటుంద‌ట.. ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది జ‌గ‌న్ ని ఎదుర్కోవ‌డానికి కాదు, పీకే టీం ని ఎదుర్కోవ‌డానిక‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.