సొంత ఉరిలో బాబు కుటుంబానికి ఘోర అవమానం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp leaders attack babu cousin brother son
Updated:  2018-03-04 04:43:13

సొంత ఉరిలో బాబు కుటుంబానికి ఘోర అవమానం

ఈ మధ్య కాలంలో టీడీపీ కార్యకర్తల ఆగడాలు మరీ మితీమిరిపోయాయి. ఇతర పార్టీల నేతలను, వనజాక్షి లాంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల‌పై దాడి చేయడం తెలిసిందే. ఇటీవల వట్టి వసంతకుమార్‌పై దాడి కేసులో శిక్ష పడ్డ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలోనూ ఈ విషయం రుజువైంది. కానీ ఇప్పుడు అందుకు  భిన్నంగా టీడీపీ కే చెందిన రెండు వర్గాలకు గొడవ జరిగింది, అది కూడా  ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు  సొంత ఊరు నారావారిపల్లెలోనే జరగడం గ‌మ‌నార్హం. 
 
 రైతు రథం పేరుతో ట్రాక్టర్ లను ఏపీ  ప్రభుత్వం పంపిణి చేస్తోంది. ఈ పంపిణి  అధికార పార్టీ కి చెందిన గ్రామస్థాయి కార్యకర్తల మధ్య గొడవకు కారణమైనది. ఈ గొడవ  టీడీపీ మండలాధ్యక్షుడి వ‌ర్గానికి, చంద్రబాబు చిన్నాన్న నారా పట్టాభినాయుడు. వర్గానికి మధ్య జరిగింది. తక్కువ మొత్తంలో ఇస్తున్నటువంటి రైతు రథం ట్రాక్టర్లు మా వర్గానికి కావాలంటే మా వర్గానికి కావాలంటూ  ఇరు వర్గాలు గొడవకు దిగాయి.
 
ఈ గొడవ గురించి తెలుసుకొన్న చంద్రబాబు చిన్నాన్న కుమారుడు విదేశాల నుంచి బయలుదేరాడు. అతనికి రాక గురించి తెలిసిన మండలాధ్యక్షుడి వర్గ కార్యకర్తలు,  మార్గ మధ్యలో  విదేశాల నుండి వ‌చ్చిన శ్రీహ‌రి నాయుడిపై దాడిచేసి అతని కారుని ద్వంసంచేసారు. దీంతో ఈ ఘటన పై చంద్ర‌బాబు చిన్నాన్న కుటుంబం  స్థానిక పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.