క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై టీడీపీ నాయకులు దాడి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 18:11:41

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై టీడీపీ నాయకులు దాడి

ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై అనంత‌పురం టీడీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఈ రోజు క‌న్నా అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌ట‌న‌ నేప‌థ్యంలో ఆర్ అండ్ బి అతిధి గృహ‌నికి చేరుకోగానే టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఒక్క సారిగా అత‌నిపై బౌతిక దాడి చేసేందుకు మూకుమ్మ‌డి వ‌చ్చారు. దీంతో బీజేపీ నాయ‌కులు వారిని అడ్డుకోగా ఇరువురి మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీ నాయ‌కుల‌కు స‌ర్థిచెప్పే ప్ర‌య‌త్నాలు చేశారు. కాని టీడీపీ కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌ను కేర్ చేయ‌క‌పోవ‌డంతో వారిపై లాటీ చార్జ్ చేశారు.
 
2014లో ఎన్నిక‌ల్లో బీజేపీతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవత్స‌రాలు పొత్తుపెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలీవ‌లే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాను ఏపీకి ప్ర‌క‌టించాలంటూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేశారు. దీంతో టీడీపీ నాయ‌కులు అల‌ర్ట్ అయి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో బీజేపీ మిత్ర‌ప‌క్షానికి క‌టీఫ్ చెప్పి ఆ త‌ప్పంతా కేంద్రంపై తోసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు తెలుగు త‌మ్ముళ్లు.
 
ఇక బీజేపీ నాయ‌కులు కూడా త‌మ‌దైన శైలిలో టీడీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక ఈ విమ‌ర్శ‌లు చేయ‌డంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ముందంజ‌లో ఉన్నారు. దీంతో టీడీపీ నాయ‌కులు ఆయన‌పై కొద్ది కాలంగా గుర్రుగా ఉన్నారు. ఇక తాజాగా ఆయ‌న అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నార‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు తెలియ‌డంతో ముందుగానే తెలుగు తమ్ముళ్లు అనంత‌పురం గెస్ట్ హౌస్ కు చేరుకుని ఆయ‌న‌పై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు.
 
ఇక‌ ఆయ‌న గెస్ట్ హౌస్ కు చేరుకోవ‌డంతో టీడీపీ కార్య‌క‌ర్త‌లు మూకుమ్మ‌డిగా దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నాయ‌కులు గెస్ట్ హౌస్ లో ఉన్న అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్టారు. త‌మ పార్టీ నాయ‌కుడిని అవ‌మానించారంటూ బీజేపీ నాయ‌కులు టీడీపీ నాయ‌కుల జెండాల‌ను త‌గ‌ల‌బెట్టి వారిపై తిర‌బ‌డ్డారు. 
 
కాగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకోక ముందు కొద్దిరోజుల క్రితం క‌ర్ణాట‌క రాష్ట్రంలో ర‌స‌వ‌త్తరంగా కొన‌సాగిన ఎన్నిక‌ల్లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్ర‌చారం ముగించుకుని తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌స్తే అక్క‌డ కూడా టీడీపీ నాయ‌కులు కాపు కాసి ఆయ‌న‌పై దాడి చేశారు. ఈ దాడిలో అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల‌తో టీడీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఇక ఈ దాడి మ‌రువ‌క‌ముందే ఇప్పుడు క‌న్నాపై టీడీపీ నాయ‌కులు దాడి చేశారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.