క‌న్నాపై చెప్పుల‌తో దాడి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kanna lakshmi narayana
Updated:  2018-07-04 06:53:09

క‌న్నాపై చెప్పుల‌తో దాడి

భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌పై కావ‌లిలో అధికార తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు చెప్పుల‌తో దాడి చేశారు. గ‌త కొద్దికాలంగా టీడీపీ ప‌రిపాల‌న‌పై క‌న్నా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్న‌సంగ‌తి తెలిసిందే ఈ క్ర‌మంలో క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ కావలిలో ప‌ర్య‌టిస్తుండ‌గా టీడీపీ కార్య‌క‌ర్త‌లు కాపు కాసి అత‌న్ని చెప్పుల‌తో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు టీడీపీ కార్య‌క‌ర్త‌లను చిత‌క్కొట్టి పోలీసుకుల‌కు అప్ప‌గించారు.
 
అనంత‌రం బీజేపీ నాయ‌కులు పెద్దఎత్తున పోలీస్ స్టేష‌న్ ముందు బైఠాయించి టీడీపీ నాయ‌కులకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేస్తున్నారు. అధికార బ‌లంతో టీడీపీ నాయ‌కులు కావాల‌నే బీజేపీ నాయ‌కుల‌పై దాడి చేయిస్తున్నార‌ని, అయితే ఈ దాడులను వెంట‌నే పోలీసులు అరిక‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.
 
దాడులు కేవ‌లం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీల ప్రోత్సాహంతోనే కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డుతున్నార‌ని బీజేపీ నాయ‌కులు మండిప‌డ్డారు. అయితే దాడి చేయిస్తున్న వారంద‌రిపై పోలీసులు చ‌ర్య తీసుకోవాల‌ని బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. గ‌తంలో కూడా క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌పై టీడీపీ నాయ‌కులు దాడి చేస్తే పోలీసులు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఇప్పుడు అయినా పోలీసులు స్పందించి టీడీపీ నాయ‌కులు చేస్తున్న దాడుల‌కు అడ్డుక‌ట్ట‌వేయాల‌ని బీజేపీ నాయ‌కులు వాపోతున్నారు.