టీడీపీ నేత‌లు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp leaders attacks ycp leaders
Updated:  2018-03-20 07:23:08

టీడీపీ నేత‌లు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడీ

ప్ర‌తిప‌క్ష‌నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగున బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... ఈ యాత్ర నిర్విరామంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌ కంచుకోట అయిన‌టు వంటి గుంటూరు జిల్లా పెద‌నందిపాడు మండ‌లం కొప్ప‌ర్రు గ్రామంలో సాగుతోంది... ఈ సంక‌ల్ప యాత్ర‌కు స్థానికంగా ఉన్న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు అధిక సంఖ్య‌లో పాల్గొని విజ‌య‌వంతం చేశారు.. 
 
అయితే త‌మ ప్రాంతం నుంచి సంక‌ల్ప‌యాత్ర ముగిసిన నేప‌థ్యంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు గుంపుగా త‌మ ప్రాంతానికి వేళ్తున్న త‌రుణంలో తెలుగు దేశం పార్టీ నాయ‌కులు వారు వెళ్లే దారిలో కాపు కాసి ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌ల‌కు అడ్డుగా వెళ్లి కొప్ప‌ర్రు గ్రామంలో మైకులు పెట్టుకోని మా కాల‌నీలోకి ఎందుకు వ‌చ్చారంటూ తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో గొడ‌వ‌కు దిగారు... 
 
ఈ గొడ‌వ‌లో వైసీపీ కార్య‌క‌ర్త‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి..ఈ గొడవ గురించి స‌మాచారం అందుకున్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని ఇరువురికి స‌ర్దిచెప్పి వారి నివాసానికి పంపించారు... అయితే ఈ గొడ‌వ‌లో గాయ‌ప‌డిన వైసీపీ కార్య‌క‌ర్త‌ను  స్థానికంగా ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు...  సంక‌ల్ప యాత్ర‌లో గొడ‌వ విష‌యం జ‌గ‌న్ కు తెలియ‌గానే గాయ‌ప‌డిన వైసీపీ కార్య‌క‌ర్త ప‌రిస్థితిని అడిగా తెలుసుకున్నారు.. విమర్శలు చేసారు...
 
ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ... త‌మ కార్యక‌ర్త‌పై జ‌రిగిన దాడిపై మండిప‌డ్డారు... టీడీపీ నాయ‌కులు హ‌త్య రాజ‌కీయాలు చేస్తున్నార‌న‌డంలో ఇంత‌కంటే పెద్ద సాక్షం మ‌రొక‌టి లేద‌ని అన్నారు... ఈ కుట్ర చంద్ర‌బాబే చేయించార‌ని, త‌మ పార్టీ తెలుపుతున్న మ‌ద్ద‌తును స‌హించ‌లేకే ఇంత‌టి దారుణానికి ఒడిక‌డుతున్నార‌ని మండిపడ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.