టీడీపీ నేత‌ల హైడ్రామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-11 04:15:17

టీడీపీ నేత‌ల హైడ్రామా

తెలుగుదేశం పార్టీకి చెందిన రాయ‌ల‌సీమ నేత‌లు పొలిటిక‌ల్ హైడ్రామా మొద‌లుపెట్టారు. క‌ర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ రాయ‌ల‌సీమ వ్యాప్తంగా   గ‌త కొన్ని నెల‌లుగా  న్యాయ‌వాదులు దీక్ష‌లు చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.
 
క‌ర్నూల్లో జ‌రుగుతున్న దీక్ష‌ల‌కు స్ధానిక టీడీపీ నేత‌లు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం సంతోషించ‌ద‌గిన విష‌యం. అయితే ఇక్క‌డ రాజ‌కీయంగా త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో న్యాయ‌వాదుల‌కు టీడీపీ నేత‌లు  మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని చెప్ప‌డంతో ఏమాత్రం సందేహం లేదు. ఇక్క‌డ మ‌ద్ద‌తు తెలిపుతున్న టీడీపీ నాయ‌కులు హైకోర్టు అంశాన్ని చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఎందుకు ప్ర‌స్తావించ‌డం లేద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు
 
ఉప ముఖ్య‌మంత్రి  కే.ఈ క్రిష్ణ‌మూర్తి  క‌ర్నూలు జిల్లాకు చెందిన వారైనా కూడా హైకోర్టు విష‌యంపై ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌నా లేదు. ఇక్క‌డ న్యాయ‌వాదుల గోడు విన‌కుండా ఏక‌ప‌క్షంగా హైకోర్టును అమ‌రావ‌తిలో ఏర్పాటు  చేసేందుకు స‌న్న‌ద‌మైంది టీడీపీ ప్ర‌భుత్వం.  ఈ క్ర‌మంలో రాయల‌సీమ నేత‌లు తూ..తూ మంత్రంగా దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తు ఇస్తూ ప‌రువు కాపాడుకుంటున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.