అంత దైర్యం లేదు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 11:09:27

అంత దైర్యం లేదు ?

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల నేష‌న‌ల్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీకీ ప్ర‌త్యేక హోదా ఎవ‌రు ఇస్తే వారితో క‌లిసి ముందుకు వెళ‌తాం అని వారికి మ‌ద్ద‌తు ఇస్తాం అని అన్నారు. అయితే జ‌గ‌న్ అటువంటి స్టేట్  మెంట్ ఇచ్చిన వెంట‌నే, బీజేపీ కం తెలుగుదేశం నాయ‌కులు ఎవ‌రికి వారు జ‌గ‌న్ కు  స‌పోర్ట్ గా రివ‌ర్స్ గా మాట్లాడారు....రాజ‌కీయంగా విభేదించేవారు విభేదించినా, ఇక్క‌డ పాయింట్ ప్ర‌జ‌ల‌కు మంచి చేసేవారితోనే నా ప్ర‌యాణం అని ఓ క్లారిటీ ఇచ్చారు జ‌గ‌న్.
 
అయితే జ‌గ‌న్ తో బీజేపీ క‌లిసి న‌డ‌వాల‌ని ఉవ్విళ్లూరుతున్నా బీజేపీతో క‌లిసి జ‌గ‌న్ ముందు అడుగువేయాల‌ని త‌హ‌తాహ‌లాడుతున్నా డెసిష‌న్ తీసుకోవల‌సింది మాత్రం కేంద్రం... ఎందుకంటే  దీనిపై ఓ నోట్ బీజేపీ వ‌ద‌లాలి, ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌ట‌న పై అందుకే జ‌గన్ ఆచి తూచి మాట్లాడారు అనేది గ్ర‌హించాలి....  అందుకే నేడు జ‌గ‌న్ కు ఎటువంటి అప‌వాదులు బ‌డ్జెట్ పై లేకుండా చేసింది ఆ కామెంట్.
 
ఇక్క‌డ లాజిక్ - జిమ్మిక్కులు ఏమీ లేవు, కేవ‌లం తెలుగుదేశం ఇప్ప‌టి వ‌ర‌కూ ఖ‌ర్చుపెట్టిన లెక్క‌లు పావ‌లా నుంచి పోల‌వ‌రం వ‌ర‌కూ అన్ని శ్వేత ప‌త్రంగా విడుద‌ల చేస్తే, తెలుగుదేశానికి ఎక్క‌డ లేని పేరు వ‌స్తుంది... అయితే ఆ సాహాసం తెలుగుదేశం చేయ‌డం లేదు.. పోని కేంద్ర నిధులు రాష్ట్ర ఖ‌జానాకు మ‌ర‌లించాము అని చెప్పినా, ఆ ట్రెజ‌రీ బిల్లులు లెక్క‌లు చెప్ప‌డం లేదు.. మోదీ - అమిత్ షా జీ ఈ విష‌యాల‌ను ప‌సిగ‌ట్టారు, అస‌లు మూడు సార్లు సీఎంగా చేసిన మోదీకి ఈ లెక్క‌లు తెలియ‌వా, ఆ లొసుగులు ఎరుగ‌వా కాని  ఈ విష‌యాన్ని మ‌రిచి అమ‌రావ‌తికి సాయం లేదు చేయ‌లేదు అని అన‌డంతో మోదీ అమిత్ షా తాడో పేడో తేల్చుకోవ‌డానికి డిసైడ్ అయ్యారు..
 
అంతేకాదు బ‌డ్జెట్ కోత‌తో ఏపీ ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచారు.. చివ‌ర‌కు బాబు ఈ విష‌యంలో సెంట‌ర్ అయ్యారు, అందుకే ఏపీ బీజేపీ నేత‌లు బాబుపై మంత్రుల‌పై మొత్తం సైకిల్ పార్టీపై విరుచుకుప‌డుతున్నారు. ఏపీ బీజేపీ నేత‌లు చెప్పేది ఒక్క‌టే జ‌స్ట్ మోదీని !! ట‌చ్ చేసి చూడు!!  స్టేట్ నుంచి స్టేల వ‌ర‌కూ అన్ని లెక్క‌లు తీస్తాం అంటున్నారు, బాబును.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.