తారా స్థాయిలో టీడీపీ కుల రాజ‌కీయాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-31 14:15:57

తారా స్థాయిలో టీడీపీ కుల రాజ‌కీయాలు

అధికార తెలుగుదేశం పార్టీ నుంచి క‌ర్నూల్ జిల్లా కృష్ణ‌గిరి మండ‌లంలో ఎంపీటీసీగా గెలుపొందిన ఓ మహిళ... ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను తీర్చాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధిగా ఉండాలి. కానీ ఆమె జీవ‌న ప‌రిస్థితిని పార్టీ నాయ‌కులు ద‌య‌నీచంగా మార్చేశారు. కూర‌పాటి సుంకుల‌మ్మ రంగ‌న్న దంప‌తులు గతంలో  హైద‌రాబాద్ ద్ లో చిన్నా చితక ప‌నుల‌ను చేసుకుంటూ బ్ర‌తికేవారు.
 
ఇక కృష్ణ‌గిరిలో అధికార పార్టీ నాయ‌కులు సుంకుల‌మ్మ‌ను ఎంపీటీసీగా పోటీ చెయ్యాల‌ని మీకు అండ‌గా ఉంటామ‌ని పిలుపునిచ్చారు. వారి మాట‌ల‌ను న‌మ్మి త‌మ జీవ‌నోపాధిని వ‌దిలేసి కుటంబంతో స‌హా సొంత గ్రామానికి చేరుకున్నారు. టీడీపీ నాయ‌కులు కోరిక మేర‌కు అప్పు సొప్పు చేసి ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీచేసి గెలిచారు. అయితే ఇంత వ‌ర‌కు క‌థ బాగానే ఉంది. 
 
సుంకుల‌మ్మ పేరుకు మాత్ర‌మే  ఎంపీపీ. అధికారుల‌కు సంత‌కాలు అవ‌స‌రం అయిన‌ప్పుడు మాత్ర‌మే ఆమెను పిలుస్తారు త‌ప్ప ఎంపీపీ కార్యాలయంలో త‌న‌కు హోదా ఇవ్వ‌డంలేద‌ని సుంకుల‌మ్మ వాపోతున్నారు. త‌న‌ను మండ‌ల ప‌రిష‌త్ స‌మావేశాల‌కు పిలువ‌ర‌ని మండిప‌డ్డారు.
 
అస‌లు త‌న‌ను ద‌ళిత మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధిగా టీడీపీ అధికారులు గుర్తించ‌డంలేద‌ని ఆమె వాపోతున్నారు. అధికార‌పార్టీ నాయకులు స్వార్థం కోసం త‌న‌ను పావుగా వాడుకున్నారు త‌ప్ప త‌న‌కు ఎలాంటి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌ని సుంకుల‌మ్మ ఆరోపిస్తున్నారు. 
 
డిప్యూటి ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు, కేఈ జ‌య‌న్న కృష్ణ‌గిరిలో రాజ్యంగేత‌ర శ‌క్తిగా మారుతున్నార‌ని  ప్ర‌జ‌లు వాపోతున్నారు. జ‌య‌న్న ఛాంబ‌ర్ కు వెళ్లాలి అన్నా సుంకుల‌మ్మ బాధితురాలిగా ఛాంబ‌ర్ గేటు వ‌ద్ద నిల‌బ‌డాలి త‌ప్ప ఎంపీపీగా త‌న‌కంటూ ఎటువంటి అధికారం లేకుండా చేశార‌ని మండిప‌డ్డారు.
 
అధికార పార్టీ నాయ‌కుల ఆగ‌డాల‌ను త‌ట్టుకోలేక ఒక‌ వైపు... ఆత్మాభిమానం చంపుకోలేక మ‌రోవైపు కూర‌గాయాల‌ను అమ్ముకుంటూ సుంకుల‌మ్మ కుంటుంబాన్ని పోషించుకుంటున్నారు. అనేక సంద‌ర్బాల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద‌ళితుల‌కు అండ‌గా ఉంటాన‌ని చెప్పుకునే ఆయ‌న.. త‌న పార్టీకి చెందిన ద‌ళిత ప్ర‌జా ప్ర‌తినిధినికి జ‌రుగుతున్న అన్యాయం క‌న‌బ‌డ‌దా అని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.