లోకేశ్ త‌డ‌బాటుకు బాబు ఎంత ఖ‌ర్చుపెట్టారో తెలిస్తే షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-13 18:25:05

లోకేశ్ త‌డ‌బాటుకు బాబు ఎంత ఖ‌ర్చుపెట్టారో తెలిస్తే షాక్

గ‌త సంవ‌త్స‌రం రాజ్యాంగ పితామ‌హుడు డా.బీ.ఆర్ అంబేద్క‌ర్ జ‌యంతిరోజు నాడు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూమారుడు మంత్రి నారాలోకేశ్ వ‌ర్ధంతి శుభాకాంక్ష‌లు అని చెప్పిన సంఘ‌ట‌న రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రిచిపోకముందే మ‌రోసారి త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించారు. మొన్న‌టికి మొన్న కాకినాడ స‌భలో త‌న ప్ర‌సంగంతో స‌భ‌కు వ‌చ్చిన వారిని క‌డుపుబ్బా న‌వ్వించిన‌ లోకేశ్ నిన్న క‌ర్నూల్ జిల్లాలో కూడా న‌వ్వుల్లో ముంచెత్తారు.
 
ఎన్టీఆర్ ను ముఖ్య‌మంత్రిని చేసిన ఘ‌న‌త మాజీ కాంగ్రెస్ ప్ర‌ధాన మంత్రి ఇంధిరా గాంధీదేనంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇలా లోకేశ్ త‌డ‌ప‌డ‌టం కొత్తేమికాదు. అనేక సంద‌ర్బాల్లో చిన‌బాబు త‌డ‌బ‌డుతూనే ఉంటారు. లోకేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దేశంలో కానీ రాష్ట్రంలో ఏదైనా కానీ అవినీతి బందుప్రీతి పార్టీ ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఎమ్మెల్సీగా, అలాగే మంత్రిగా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన స‌మ‌యంలో సార్వ‌భౌమ‌త్వం అనే ప‌దం ప‌లికిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు ఆయ‌న త‌డ‌బాటు కొన‌సాగుతూనే ఉంది. 
 
లోకేశ్ ప‌దేప‌దే త‌డ‌ప‌డ‌టం చూసి ఆయ‌న తండ్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా నెల‌కు రెండు ల‌క్ష‌ల జీతం ఇచ్చి పెద్ది రామారావు చేత బ‌హిరంగ స‌భ‌ల్లో ఎలా మాట్లాడాలో అనే దానిపై శిక్ష‌ణ ఇప్పించార‌ట‌. అయిన‌ప్ప‌టికి లోకేశ్ తీరులో మాత్రం ఎటువంటి మార్పు క‌నిపించ‌లేద‌ని టీడీపీ నేత‌లే గుస‌గులాడుతున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో టీడీపీ అధిష్టానం జ‌న‌చైత‌న్య యాత్ర ప్ర‌వేశ‌పెడితే ఈ యత్ర‌లో లోకేశ్ ప్ర‌తిపక్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విధ్యార్థుల‌తో నిర్వ‌హిస్తున్న‌యువభేరీ స‌భ‌ల‌కు వ్య‌తిరేకంగా విద్యార్థుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు. ఇక ఈ స‌భ‌లో విద్యార్థులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు లోకేశ్ త‌డ‌బ‌డటంతో ఈ స‌మావేశాల‌ను మ‌ధ్య‌లోనే నిల‌పివేయాల్సి వ‌చ్చింది. 
 
ఇక లోకేశ్ త‌డ‌బాటుపై పార్టీ శ్రేణులే అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. లోకేశ్ ప‌దేప‌దే త‌డ‌బ‌డుతూ పార్టీ ప‌రువు తీస్తున్నార‌ని, త‌ప్పులు మాట్ల‌డుతున్నార‌ని అందుకు బ‌దులు ఊరికే ఉంటే చాల‌ని పార్టీ నాయ‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. అనేక స‌భ‌ల్లో టీడీపీ రాజ‌కీయ కిర‌ణం అని చెప్పుకునే లోకేశ్ కు రాజ‌కీయ ప‌రిణితి ఏమాత్రం లేద‌ని అధిష్టాన నాయ‌కులు చెవులు కొరుక్కుంటున్నార‌ట‌. ఏపీలో యువ‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, తెలంగాణ‌లో కేటీఆర్ రాజ‌కీయాల్లో దూసుకుపోతుంటే ఇక లోకేశ్ రాజ‌కీయాల్లో అ ఆ ల ద‌గ్గ‌రే ఉన్నార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఎద్దేవా చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.