నేడు టీడీపీ స‌మ‌క్షంలో దీక్ష‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-11 12:42:11

నేడు టీడీపీ స‌మ‌క్షంలో దీక్ష‌

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కు రైల్వేజోన్ ల‌ను డిమాండ్ చేస్తూ అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దీక్షలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి టీడీపీ నాయ‌కులు ఈ రోజు అనంత‌పురం జిల్లా ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో క‌రువు నేల‌పై కేంద్రం వివ‌క్ష అనే పేరుతో దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష ఉద‌యం నుంచి సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ఈ స‌భ‌కు ఎమ్మెల్యేలు ఎంపీలు, జిల్లా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు హ‌జ‌ర‌య్యారు. ఈ దీక్ష‌లో మ‌రోసారి టీడీపీ నాయ‌కులు కేంద్రాన్ని నిల‌దీస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.. 
 
కేంద్ర ప్ర‌భుత్వం క‌రువు ప్రాంతాల‌కు ఇస్తున్న నిధుల‌ను ఉప‌సంహ‌రించుకుంటుంద‌ని  ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని ఈ వేధిక ద్వారా టీడీపీ నాయ‌కులు వివ‌రిస్తున్నారు. వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌కు ప్ర‌తీ ఏట 50 కోట్ట రూపాయ‌ల‌ను ఇవ్వాల‌ని ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్నా కూడా నిధులు రావడంలేద‌ని వారు మండిప‌డ్డారు.
 
అయితే ప్ర‌స్తుతం త‌మ నేత చంద్ర‌బాబు నాయుడు కేంద్రంతో సంబంధాలు తెంచుకోవ‌డంతో కేంద్రం నిధులు ఇచ్చిన‌ట్లే ఇచ్చి ఆ నిధుల‌ను వెన‌క్కి తీసుకుంద‌ని టీడీపీ నాయ‌కులు వాపోయారు. కాగా ఈ దీక్ష‌కు వ‌చ్చిన కార్య‌క‌ర్త‌లంద‌రిని ధ‌ర్మ‌వరం ఎమ్యెల్యే చూసుకుంటున్నారు. ఇక ఇదే ప్రాంగ‌ణంలో కొద్దిరోజుల క్రితం ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా కేంద్ర రాష్ట్రాన్ని విమ‌ర్శిస్తూ వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌ చేసిన సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.