11న టీడీపీ నాయ‌కులు దీక్ష‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 18:21:55

11న టీడీపీ నాయ‌కులు దీక్ష‌

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుట్ర రాజ‌కీయాలకు వ్య‌తిరేకంగా, అలాగే ప్ర‌త్యే హోద ఇస్తామ‌ని చెప్పి కేంద్రం ఇవ్వ‌కుండా చేసినందుకు వ్య‌తిరేకంగా ధ‌ర్మ‌పోరాట దీక్ష పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష‌లు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ధర్మ పోరాట దీక్షను చేప‌ట్టిన‌ సంగ‌తి తెలిసిందే. 
 
ఇక తాజాగా మ‌రోసారి  టీడీపీ నాయ‌కులు ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ను అనంత‌పురం జిల్లాలో చేప‌ట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఇందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేసింది టీడీపీ అధిష్టానం. ఈ నెల 11వ తేదిన ఉద‌యం నుంచి సాయ‌త్రం వ‌ర‌కు టీడీపీ నాయ‌కులు ఈ దీక్ష‌ను చేయ‌నున్నారు. 
 
ఈ దీక్ష‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజ‌రు కానున్నారు వారితో పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద ఎత్తున హజ‌రు కావాల‌ని పార్టీ నాయ‌కులు సూచించారు. ఇక‌ మ‌రోవైపు ఈ దీక్ష‌పై బీజేపీ నాయ‌కులు, వైసీపీ నాయ‌కులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.