గుప్త నిధుల కోసం తెలుగు త‌మ్ముళ్ల డ్రామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 01:18:27

గుప్త నిధుల కోసం తెలుగు త‌మ్ముళ్ల డ్రామా

క‌ర్నూలు జిల్లా తుగ్గ‌లి మండ‌లం చెన్నంప‌ల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ  స్ధానిక ప్ర‌భుత్వ  అధికారులు  గ‌త 36 రోజుల పాటు త‌వ్వ‌కాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే...  ముందుగా ఈ త‌వ్వ‌కాల్లో ఎలాంటి నిధులుదొర‌క‌లేదు. త‌వ్వ‌కాల్లో  ఏనుగు దంతాలు, విలువైన రాగి వ‌స్తువులు, బ‌య‌ట‌ప‌డటంతో  అధికారులు  స్కానింగ్ చేసి తిరిగి త‌వ్వ‌కాల‌ను ముమ్మ‌రంగా చేప‌డుతున్నారు...
 
అధికారులు విలువైన నిధికి చాలా ద‌గ్గ‌రకు వ‌చ్చామ‌ని తెలుప‌డంతో  లోక‌ల్ లో  ఆధిప‌త్యం కొన‌సాగిస్తున్న అధికార నాయ‌కులు నిధుల‌ను సొంతం చేసుకునేందుకు య‌త్నిస్తున్నారు... అధికారాన్ని అడ్డం పెట్టుకుని  నిధుల‌ను దోచుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం... 
 
ఈ క్ర‌మంలో  స్థానికంగా ప‌నిచేస్తున్న కూలీల‌ను తొల‌గించి వారి స్థానాల్లో  ప్రాంతీయ భాష రాన‌టువంటి  కూలీల‌తో త‌వ్వ‌కాలు చేపిస్తున్నార‌ట‌... ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడుతూ.... భూమి లోప‌లి భాగాన్ని స్కానింగ్ చేస్తున్నారు... గతంలో స్థానిక కూలీలను పెట్టి తవ్వకాలు సాగించిన అధికారులు, ఇప్పుడు మాత్రం వారిని తొలగించి, వేరే ప్రాంతపు కూలీలను తీసుకువచ్చి పని చేపించ‌డం ప‌ట్ల అనేక అనుమానాలు వ‌స్తున్నాయంటూ గ్రామ‌స్తులు తెలుపుతున్నారు...  గుప్త నిధుల‌కోసం  స్ధానిక  అధికారులు,  ప‌చ్చ రాజ‌కియ నాయ‌కులు కుమ్మ‌క్కై కుట్ర చేసే ప‌నిలో ప‌డ్డార‌ని గ్రామ‌స్తులు అనుమానిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.