టికెట్ కోసం త‌మ్ముళ్లు త‌న్నులాట‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-11 17:05:40

టికెట్ కోసం త‌మ్ముళ్లు త‌న్నులాట‌

రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డిల మ‌ధ్య వర్గ‌పోరు రోజు రోజుకు పెరిగిపోతుంది.  గ‌తంలో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అఖిల ప్రియ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య ఏవిధంగా వ‌ర్గ‌పోరు సాగిందో అదే స్థాయిలో క‌ర్నూల్ అర్భ‌న్ లో చోటు చేసుకుంటున్నాయి. టీజీ, ఎస్వీల మ‌ధ్య రాజ‌కీయ‌ విభేదాలు  చాలా కాలం నాటి నుంచే ఉన్నాయి. 
 
గ‌త ఎన్నిక‌ల్లో టీజీ వెంక‌టేష్ పై ఎస్వీ మోహ‌న్ రెడ్డి గెల‌వ‌డంతో  ఇద్ద‌రి మ‌ధ్య శ‌త్రుత్వం ఎక్కువ అయింది. ఇక దీనికి తోడు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎస్వీ మోహ‌న్ రెడ్డికి కర్నూల్ ఇంచార్జ్ ప‌ద‌వుల‌ను క‌ట్ట‌పెట్ట‌డంతో టీజీ, ఎస్వీ మ‌ధ్య అఘాధం మ‌రింత పెరిగింది. 30 సంవ‌త్స‌రాల నుంచి క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న గుప్పెట్లో పెట్టుకున్న టీజీకి ఎస్వీ వైఖ‌రి మింగుడు ప‌డ‌కుండా ఉంద‌ట‌. 
 
ఇక ఈ సారి ఎలాగైనా త‌న కుమారుడు భ‌ర‌త్ కు క‌ర్నూల్ సీటు ఇప్పించాల‌ని గ‌ట్టి ప‌ట్టుతో ఉన్నార‌ట టీజీ. అయితే తండ్రినే ఓడించిన వాడికి కుమారుడు ఓ లెక్కా అంటూ ఎస్వీ వ్యాఖ్య‌లు క‌ర్నూల్ టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనికితోడు చిన‌బాబు, ఎస్వీ మోహ‌న్ రెడ్డికి టికెట్ క‌న్ఫామ్ చేయ‌డంపై టీజీ వ‌ర్గీయులు ర‌గిలిపోతున్నారు టీడీపీ లో టికెట్లు ప్ర‌క‌టించేది అధినేత చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే అంటూ టీజీ ఎదురు దాడికి దిగిన సంగ‌తి తెలిసిందే.
 

షేర్ :

Comments

0 Comment